అమెరికాలో మరో కలకలం చోటుచేసుకుంది.ఇప్పటికే భారతీయులపై దాడులు, వారు ప్రమాణాల్లో మరణించడంతో ఆగమాగంగా ఉన్న భారతీయుల్లో.. కిడ్నాప్ అయిన నలుగురిలో 8 నెలల పసికందు కూడా ఉండడంతో మరింతగా ఆందోళన పెంచింది.
అమెరికాలో కాలిఫోర్నియాలోని అత్యంత రద్దీగా ఉండే మెర్సిడ్ కౌంటీలో ఈ కిడ్నాప్ చోటుచేసుకుంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో రహదారికి ఇరువైపులా పలు రీటెయిల్ దుకాణాలు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అమెరికా పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు కూంబింగ్ మొదలుపెట్టారు.
కిడ్నాపర్లు మారణాయుధాలు కలిగి ఉన్నట్టు స్తానికులు పోలీసులకు వెల్లడించారు. భారత సంతతి వ్యక్తులు జస్ దీప్ సింగ్ (36), అతడి భార్య జస్లీన్ కౌర్ (27), వారి కుమార్తె ఆరూహీధేరి (8 నెలలు ), వారి బంధువు అమన్ దీప్ సింగ్ (39) కిడ్నాప్ నకు గురైనట్టు మెర్సిడ్ కౌంటీ్ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కిడ్నాప్ నకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కిడ్నాపర్ ఎవరై ఉంటారు? ఎందుకు కిడ్నాప్ చేశాడు? కారణం ఏంటన్న దానిపై ఆరాతీస్తున్నారు.
నిందితులు ఎక్కడ కనిపించినా 911కు ఫోన్ చేయాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నిందితులు ఆయుధాలు కలిగి ఉన్నాడని.. ప్రమాదకరమైన వ్యక్తి అని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి అధికారులతో మాట్లాడి వారిని క్షేమంగా తీసుకురావాడానికి ప్రయత్నాలు చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.