భార్య జోలికి వస్తారా? దక్షిణ కొరియాపై యుద్ధానికి సిద్ధమైన కిమ్ జాంగ్

Update: 2020-07-02 15:30 GMT
కిమ్ జాంగ్ ఉన్. ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఆవేశం వచ్చినా.. అనుగ్రహం వచ్చినా ఆపుకోలేరంటారు. ఇప్పటికే తనకు పోటీగా ఉన్న తోటి వంశస్థులందరినీ చంపి నరరూప రాక్షసుడిగా పేరుగాంచిన ఈ ఉత్తరకొరియా అధ్యక్షుడితో ఇప్పుడు పక్క దేశం దక్షిణ కొరియా ఆటలు ఆడుతోంది. అతడిని కవ్వించింది. కిమ్ జాంగ్ భార్య ఫొటోలను సరిహద్దుల్లో బెలూన్లతో వదిలేసింది. అందులో అసభ్యంగా మార్ఫింగ్ చేయడంపై కిమ్ జాంగ్ సీరియస్ అయ్యారు. దక్షిణ కొరియాపై యుద్ధానికి సిద్ధం కండి అని కిమ్ తన ఆర్మీకి పిలుపునిచ్చాడు.

ఈ క్రమంలోనే దక్షిణ కొరియా సరిహద్దుల్లోని ఆ దేశానికి చెందిన ఆఫీస్ ను తాజాగా ఉత్తరకొరియా ఆర్మీ పేల్చేసింది. ఇప్పటికే కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణకొరియాకు గట్టి హెచ్చరికలే పంపింది. తీరు మార్చుకోకపోతే సైనిక చర్యలకు వెనుకాడమంటూ ప్రకటించింది.

తాజాగా దక్షిణ కొరియా సరిహద్దుల్లో విడుదల చేసిన కరపత్రాల్లో తన భార్య రిసోల్ జు ఫోటోలు ఉండడంపై కిమ్ కి చాలా కోపం తెప్పించిందట.. వెంటనే దక్షిణకొరియాపై కిమ్ యుద్ధానికి సిద్ధమయ్యారట.. అయితే ఏమైందో ఏమోకానీ మళ్లీ ఈ యుద్ధంపై పునరాలోచనలో పడ్డారట.. అయితే దాడికి మాత్రం ఆర్మీ సిద్ధంగా ఉండడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
Tags:    

Similar News