కిమ్ నిర్ణ‌యాలే కాదు.. విన్యాసాలు షాకింగే!

Update: 2017-10-09 10:48 GMT
ఓ మోస్త‌రు లావుగా ఉండి కొంత దూరం న‌డిచేస‌రికే ఆయాస ప‌డితాం! అలాంటిది సుమారు 90 నుంచి 100కిలోలు ఉన్న వ్య‌క్తి అల‌వోక‌గా ఒక్క చేతిపై బ్యాలెన్స్ చేసుకుంటూ.. త‌ల కింద పెట్టి కాళ్లు పైకి పెట్టి గిర‌గిరా తిర‌గ‌డం అంటే మాట‌లు కాదు క‌దా!! మ‌రి అలా చేయాలంటే ఎంత ఫిట్‌నెస్ ఉండాలి? ఎంత క‌ఠోర సాధ‌న ఉండాలి? మ‌రి ఇలాంటి విన్యాస‌మే కిమ్ చేస్తే? ఏంటి ఆశ్చ‌ర్యంగా ఉందా? న‌మ్మ‌శక్యంగా లేదా? అయితే ఈ వీడియో చూస్తే మీరు ఇక కాసేప‌టి వ‌ర‌కూ షాక్‌లోనే ఉంటారేమో!! కిమ్‌ ఫిట్‌ నెస్ గురించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో చూస్తే.. ఔరా అనిపించ‌క‌మాన‌దు!!

ఆయ‌న నిర్ణ‌యాలు నియంతల‌ను గుర్తుకుతెస్తాయి! ఆయ‌న శ‌రీరాకృతి న‌వ్వు తెప్పిస్తుంది! ఆయ‌న హెయిర్ స్టైల్‌.. యువ‌త‌కు ఐకాన్‌గా నిలుస్తుంది! ఆయ‌న ట్వీట్లు ప్రపంచ దేశాల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తాయి! ఆయ‌న మాట‌.. ఆ దేశ ప్ర‌జ‌లంద‌రికీ శిలాశాస‌న‌మే! మ‌రి ఇన్ని ప్ర‌త్యేక‌తలు ఉన్న ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ఇప్ప‌టివ‌రకూ ప్రపంచానికి చాలా విష‌యాలే తెలుసు! కానీ ఇప్పుడు ! ఆయ‌న గురించి ఏ చిన్న విష‌యం తెలిసినా అది ఆశ్చ‌ర్యం క‌లిగించేదే!! వరుస క్షిపణి - అణు పరీక్షలతో అమెరికాకు నిద్ర లేకుండా చేస్తున్న కిమ్... కరుడుగట్టిన నియంత్ర మాత్రమే కాదు.. మంచి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కూడా. సంగీతమంటే చెవులు కోసుకుంటారు కూడా!!

సంగీతంపై ఉన్న మక్కువతోనే గాయని రిసోల్ జుని పెళ్లాడారు. భోజనంపై మక్కువతో కిమ్ జాంగ్ బొద్దుగా తయారయ్యా రట. మ‌రి అంత లావుగా ఉన్నా.. ఫిట్ నెస్ విషయంలో ఆయన ఏమాత్రం రాజీ పడరని ఆయన సన్నిహితులు చెబుతారు. తాజాగా ఆయన చేసిన విన్యాసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోను ఎవరు - ఎప్పుడు - ఎక్కడ చిత్రీకరించారో తెలియనప్పటికీ... ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు కాళ్లు పైకెత్తి, చేతులను నేలకు తాకిస్తూ - గిరగిరా తిరుగుతున్న కిమ్ చూసి, అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Full View
Tags:    

Similar News