సైనిక శక్తిలో అమెరికాతో సమ ఉజ్జీగా నిలువాలన్నది తమ లక్ష్యమని, ఇందుకు చేరువ అవుతున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పదే పదే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు అంతర్జాతీయంగా తమపై ఆంక్షలు పెరుగుతున్నా, తమ అణ్వాయుధ కార్యక్రమం పూర్తి చేసి తీరుతామని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అపరిమితమైన అంతర్జాతీయ ఆంక్షల మధ్య అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో దాదాపు సఫలీకృతమయ్యామని ఆయన అన్నారు. అయితే ఇటీవల కిమ్ మనసు మారుతున్న సంగతి తెలిసిందే. శాంతి మత్రం జపిస్తూ చర్చల బాట పడుతున్నారు. ఇలాంటి చర్చల పర్వంలోనే తాజాగా కిమ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని వెలుగులోకి వచ్చింది. అదే అణు కేంద్రాల మూసివేత. అణ్వస్త్ర ప్రయోగాల నిలిపివేత!
కిమ్ సారథ్యంలో అణ్వాయుధాలకు అడ్డాగా మారిన ఉత్తరకొరియా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని అణు పరీక్షల కేంద్రాన్ని వచ్చే నెలలో మూసివేయాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తనతో భేటీ అయినప్పుడు ఈవిషయాన్ని వెల్లడించాడని మూన్ ఇన్ చెప్పారు. అమెరికా సహా అణ్వాయుధాల నిపుణులు - దక్షిణ కొరియా ప్రతినిధులు - జర్నలిస్టుల సమక్షంలో అణు పరీక్షల కేంద్రం, తయారీని పూర్తిగా నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు కిమ్ చెప్పారు అని మూన్ ఇన్ తెలిపారు.
కాగా, ఉత్తరకొరియా రథసారథి కిమ్ జీవన విధానం ఆసక్తికరమైనదని విశ్లేషకులు అంటుంటారు. ఉత్తరకొరియాలో ప్రస్తుతం మూడోతరం వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ రాజ్యమేలుతున్నాడు. ఆ బుడ్డోడే ఇప్పుడు అనుదిన అణుప్రయోగాలతో ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్నాడు. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. పెద్దన్నకు సమఉజ్జీని నేనే అంటున్నాడు. ఈ చిచ్చరపిడుగుకు రాజకీయ అనుభవంలేదు. 2011లో 30వ యేట తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణంతో ఉత్తరకొరియాకు ఉత్తరాధికారి అయ్యాడు. అది ఒంటికొమ్ము సొంటికాయ దేశం. ప్రపంచం నుంచి ముఖం తిప్పేసుకుని తనదైన లోకంలో విహరిస్తుంది. కానీ సైనికబలంలో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మిలిటరీ ఉంది. పైగా అణ్వస్త్ర రాజ్యం. ఎవరి మీద గురి అంటే అగ్రరాజ్యం అమెరికా అని చెబుతుంది. కిమ్ జోంగ్ ఉన్ కు బాస్కెట్ బాల్ అంటే పిచ్చి. బాస్కెట్ బాల్ క్రీడలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన మైకేల్ జోర్డాన్ అంటే వల్లమాలిన అభిమానం. స్విట్జర్లాండ్ లోని స్కూలు హాస్టల్ గదినిండా జోర్డాన్ పోస్టర్లే. ఉన్ లో పోటీతత్వమూ ఎక్కువే. బొద్దుగా ఉండి 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండే ఉన్ బాస్కెట్ బాల్ బాగానే ఆడేవాడని అతని క్లాస్ మేట్స్ చెప్తుంటారు. ఓటమి ఉన్ కు ఇష్టం ఉండదని, గెలుపే అతనికి ముఖ్యం అని నికొలా అన్నాడు. వెస్ట్రన్ పాప్ సంగీతం అంటే కూడా మక్కువే. విట్నీ హ్యూస్టన్ - మైకేల్ జాక్సన్ అంటే చెవికోసుకునేవాడని క్లాస్ మేట్స్ చెప్పారు. విద్యాభ్యాసం తర్వాత ఉన్ అన్నతో కలిసి కిమ్ ఇల్ సంగ్ మిలిటరీ యూనివర్సిటీలో చేరాడు. 2007లో తండ్రితో కలిసి ఇద్దరూ క్షేత్ర పర్యటనలకు వెళ్లేవారు. తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణశయ్యపై ఉన్నప్పుడు ఉన్ కు పెద్దగా అనుభవం లేకున్నా - రాజకీయ - సైనిక పదవుల్లో వెంటవెంటనే ప్రమోషన్లిచ్చి అగ్రాసనానికి చేరువ చేశారు. ఉత్తరకొరియన్లు ఈ కిమ్ వంశాంకురాన్ని మహానేత కిమ్ఇల్ సంగ్ యువ అవతారమని భావిస్తారు. ఆకారంలో తాతకు దగ్గరగా ఉంటాడని అంటారు. ఆ పోలిక కోసం ఉన్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడని చెప్తారు. కానీ ఇదంతా గిట్టని మీడియా ప్రచారమని ఉన్ అనుచరులు కొట్టిపారేస్తారు.
ఉన్ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద సైన్యాధినేత అయ్యాడు. గద్దెనెక్కేనాటికి అతని వయసు 30 ఏళ్లే. అప్పటికి ప్రపంచంలో అతిపిన్న వయస్కుడైన దేశాధీశుడు అతడే. ఇప్పటివరకూ ఉన్ విదేశీ పర్యటనకూ వెళ్లలేదు. విదేశీ నాయకుడితో భేటీ కాలేదు.పితూరీల భయంతో అధికారం సుస్థిరం లక్ష్యంతో అయి ఉండవచ్చు కానీ ఉన్ అణుఉన్మాదిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. పొరుగుదేశమైన దక్షిణకొరియాతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాడు. దక్షిణ కొరియాను, అమెరికాను అణుబాంబులతో నాశనం చేస్తానని ప్రతిజ్ఞలు చేయడం అంతకంతకూ ఎక్కువైంది. తండ్రి, తాత కూడా బెదిరించినా ఇలా అణు కార్యక్రమాన్ని పరుగులెత్తించలేదు. అణ్వస్త్ర సామర్థ్యానికి పదును పెడుతూ క్షిపణుల సామర్థ్యం పెంచుకుంటూ పోతున్నాడు. 2020 నాటికి అమెరికాను సునాయాసంగా చేరుకోగలిగే క్షిపణులు ఉత్తరకొరియా అమ్ముల పొదిలో ఉంటాయంటున్నారు. అయితే ఇటీవల తన దూకుడును తగ్గించుకొని ఆయన చర్చల బాట పట్టడం..తాజాగా అణ్వస్త్ర కేంద్రాల మూసివేత నిర్ణయం ఆహ్వానించదగ్గదని చెప్తున్నారు.