కిమ్ కు ఉన్న శ్ర‌ద్ధ కూడా ట్రంప్ కు లేదా?

Update: 2017-06-10 10:49 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ - ఉత్త‌ర‌కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఇద్ద‌రూ ఇద్ద‌రే. బ‌ల‌వంతుడునన్న అహంకారం ట్రంప్ దైతే మొండిత‌న‌మే కిమ్ ఆయుధం. దాంతో అమెరికాను ధిక్క‌రిస్తూ త‌ర‌చూ కిమ్ ఏకంగా ప్ర‌పంచాన్నే భ‌య‌పెడుతుంటారు. అవ‌స‌ర‌మైతే అణ్వాయుధాలు ప్ర‌యోగించ‌డానికి కూడా రెడీ అయ్యే కిమ్ జాంగ్ ఉన్ ను చూసి ప్ర‌పంచ‌మంతా ఈ రాక్ష‌సుడు ఎప్పుడు ఏం చేస్తాడో అని భ‌య‌ప‌డుతుంటుంది.

అయితే... అత్యంత క‌ఠినాత్ముడిగా పేరున్న కిమ్ త‌న వైర‌మంతా అమెరికా, దానికి వంత‌పాడుతూ త‌మ దేశంపైకి వ‌చ్చే దేశాల‌తోనే కానీ మిగ‌తా ప్ర‌పంచంపై కాద‌న్న‌ట్లుగా తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అంతేకాదు... ప‌ర్యావ‌ర‌ణంపై స్పృహ‌, బాధ్య‌తతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను చూసి ఇది నిజ‌మేనా అనుకుంటున్నారు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డాన్ని కిమ్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. త‌న‌ను ట్రంప్ వినాశ‌కారి అంటున్నార‌ని.. కానీ, ఆయ‌న చేసిన ఈ ప‌ని ప్ర‌పంచ వినాశ‌నానికి దారి తీస్తుంద‌ని అన్నారు.

పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని ట్రంప్ ఉల్లంఘించడాన్ని కిమ్ తీవ్రంగా తప్పుబట్టాడు. 194 దేశాలు సంతకాలు చేసిన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. పప్రంచ వినాశనకారిని తాను కాదని... అమెరికా అధ్యక్షుడే వినాశ‌కారి అని ఈ నిర్ణ‌యంతో నిరూప‌ణ అయింద‌ని అన్నారు. ప్రపంచ పర్యావరణాన్ని రక్షించడానికి ముందుకు రాని ట్రంప్... తన గురించి విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రపంచాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడటానికి 194 దేశాలు సంతకం చేస్తే... ట్రంప్ మాత్రం వెనకడుగు వేశాడని... ఆయన సెల్ఫిష్ అంటూ మండిపడ్డారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన అహంకారాన్ని సూచిస్తోందని అన్నారు.
Tags:    

Similar News