ఇంతటి విపత్తులోనూ ఆ రాజు 20 మంది అమ్మాయిలతో రాజభోగం

Update: 2020-04-01 02:30 GMT
ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్‌ తో అల్లాడి పోతుంది. ఈ సమయంలో పలు దేశాలు లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. దేశాల అధినేతలు ఇంకా ప్రధానులు కంటికి రెప్ప వేయకుండా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో థాయిలాండ్‌ రాజు మహా వాజిరాలోంగ్కోర్న్‌ మాత్రం రాజభోగాల్లో తేలి ఆడుతున్నాడు. ప్రస్తుతం తనకు తాను సెల్ఫ్‌ క్వారెంటైన్‌ లో ఉన్నట్లుగా ప్రకటించుకున్న ఈ రాజు తన దేశంలో కాకుండా జర్మనీలోని ఒక విలాసవంతమైన హోటల్‌ లో క్వారెంటైన్‌ లో ఉన్నాడు.

క్వారెంటైన్‌ లో అంటే పని వారు లేకుండా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉండాలి. కాని ఈ రాజు మాత్రం 20 మంది అందమైన అమ్మాయిలు వ్యక్తిగత పనివాళ్లు సహాయకులు ఇలా మొత్తం యాబై మందితో కలిసి ఈ రాజా వారు రాజభోగాలు అనుభవిస్తూ జర్మనీ గర్మిస్చ్‌ పార్టెన్కిర్చెన్‌ లో ఉన్నాడు. ప్రస్తుతం జర్మనీలోని అన్ని హోటల్స్‌ మూసేసి ఉన్నాయి. కాని రాజావారి సేవ కోసం మాత్రమే ఈ లగ్జరీ హోటల్‌ ఓపెన్‌ చేసి ఉంది. నెల రోజులకు గాను పూర్తిగా ఈ హోటల్‌ ను రాజా వారు బుక్‌ చేసుకున్నాడట.

థాయిలాండ్‌ లో కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉన్న ఈ సమయంలో రాజు గారు ఇలా జల్సాల క్వారెంటైన్‌ అది కూడా విదేశాల్లో ఉండటంపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వారు రాజు ఎలా అవుతాడు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లగ్జరీ సెక్సీ క్వారెంటైన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ నీయాంశం అవుతోంది.
Tags:    

Similar News