విభజన నేపథ్యంలో.. తమ బతుకు తాము బతకాలని..తమ ప్రాంతం అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైనందన్న విషయం పద్నాలుగు నెలల తర్వాత అయినా కొంతమంది మంత్రులకు కలుగుతోంది. ఈ దిశగా వారు ఆలోచిస్తూ.. తమకు సహకారం అందించే వారిని కోరుతున్నారు.
తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఇదే తీరులో ఉన్నాయి. పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన.. హైదరాబాద్ లో కార్యాలయాలు ఉన్న పారిశ్రామికవేత్తలు.. ఏపీలోని విశాఖపట్నం కానీ.. లేదంటే విజయవాడకు తమ కార్యాలయాల్ని మార్చాలని కోరారు. పారిశ్రామికవేత్తలు తమ ప్రధాన కార్యాలయాల్ని మార్చటంలో పెద్ద వ్యూహమే ఉంది.
ఒకవళ ఏపీ ప్రయత్నాలు ఫలిస్తే.. అది తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపించే వీలుంది. ఒక సంస్థ తమ కార్యకలాపాలు ఎక్కడ నిర్వహించినా.. సదరు సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందో.. తమ కంపెనీకి సంబంధించిన మొత్తం ఆదాయానికి పన్నును అక్కడే కడుతుంది.
ఈ నేపథ్యంలో వివిధ సంస్థల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో.. వాటిని విశాఖ.. విజయవాడలకు తరలించాలని అచ్చెన్నాయుడు కోరుతున్నారు. ఒకవేళ అదే జరిగితే.. హైదరాబాద్ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అయితే.. ఇలాంటి పిలుపు గతంలోనే ఇవ్వాల్సి ఉందని.. ఇప్పటికి చాలా ఆలస్యమైందన్న వాదనను సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్నారు.