పార్టీలు కలిసినా తమ్ముడిని కలవని కిరణ్

Update: 2019-06-17 04:46 GMT
రాజకీయం ఎంత చెడ్డది.. ఆ మాజీ సీఎంనే తన తమ్ముడికి దూరం చేసింది. దశాబ్ధాలుగా కలిసి నడిచిన ఆ అన్నాదమ్ముళ్ల మధ్య చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన ఆ అన్న ఇప్పుడు తమ్ముడికి దూరంగా జరిగాడు. ఎంతంటే.. సొంతింట్లో తమ్ముడు ఉన్నాడని తెలిసి గెస్ట్ హౌస్ లోనే ఉండిపోయేంత..

ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వాదిగా పేరుగడించారు. ఆ పార్టీలోనే ఎదిగారు. ఆ పార్టీ దయవల్లే సీఎం అయ్యారు. లాస్ట్ బాల్ వరకు ఆడుతానని.. ఏపీని విభజన కాకుండా అడ్డుకుంటానని ప్రతిన బూని తెలంగాణకు అడ్డుపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చేయడంతో ఇక చేసేందేం లేక ఆ పార్టీ నుంచి వైదొలిగారు. జై సమైక్యంధ్ర పార్టీ పెట్టి 2014 విభాజిత ఏపీలో పోటీచేశారు. కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయాడు. దీంతో ఈ ఐదేళ్లు మౌనంగా ఉన్న కిరణ్ 2019 ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ లోనే చేరిపోయారు. కానీ ఏపీ కాంగ్రెస్ ను లీడ్ చేయకుండా తెరవెనుకనే సైలెంట్ గా ఉంటున్నారు.

అయితే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్మడు నల్లారి కిషోర్ రెండేళ్ల వరకు అన్నచాటు తమ్ముడిగా రాజకీయం చేశారు. కానీ రెండేళ్ల క్రితం అన్నయ్య కాంగ్రెస్ బాట పడితే.. ఏపీలో కనీస ఉనికి లేని ఆ పార్టీలో చేరనని విభేదించి.. కిరణ్ తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీలో చేరారు. దీంతో అన్నాదమ్ముల మధ్య విభేదాలు పొడచూపాయి.. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీతో విభేదించి చంద్రబాబు కాంగ్రెస్ తో కలిశారు. రాహుల్ తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. టీడీపీ-కాంగ్రెస్ కలిసినా కిరణ్ మాత్రం బాబు దూరంగానే ఉండడం విశేషం.

ఇటీవల చిత్తూరు జిల్లా కలిగిరి మండలం నగిరిపల్లిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సొంతూటికి వచ్చారు. అయితే ఆ ఇంట్లో తమ్ముడు నల్లారి కిషోర్ ఉంటున్నారు. దీంతో ఆయనను కలువకుండా ఆ ఊళ్లోనే ఉన్న ప్రభుత్వ అతిథిగృహంలో ఉండి సొంతూళ్లో తన బంధువులు - ఇతర నాయకులను కలిసి వెళ్లారు. తమ్ముడున్న సొంతింటికి మాత్రం వెళ్లలేదు. కలువలేదు.

ఇలా రాజకీయ పార్టీలు ఇద్దరు అన్నాదమ్ముల మధ్య చిచ్చు పెట్టాయి. అనాదిగా ఉన్న వారి బంధుత్వం మధ్య బీటలు వచ్చేలా చేశాయి. తమ్ముడు తనను విభేదించి టీడీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేని అన్న దూరమయ్యడు. ఇక తమ్ముడు కూడా టీడీపీలో చేరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. ఇలా ఇద్దరు రాజకీయంగా యాక్టివ్ గా లేకున్నా.. వారి మధ్య మాత్రం విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 


Tags:    

Similar News