అస‌దుద్దీన్ వి ప‌నికిరాని మాట‌లు

Update: 2016-12-21 09:55 GMT
దిల్‌ సుఖ్ న‌గ‌ర్ బాంబు పేలుళ్ల నిందితుల‌కు ఉరిశిక్ష ఖ‌రారు చేయ‌డంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలు పనికిరాని మాటలని  తేలిక‌గా కొట్టి పారేశారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకు పోతున్నాయని తెలిపారు. ఎన్‌ ఐఏ కోర్టు ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించిన తీరుపై కూడా మ‌తం కోణంలో విమ‌ర్శ‌లు చేయ‌డం అస‌ద్ కే చెల్లింద‌ని వ్యాఖ్యానించారు.

దిల్‌ సుఖ్‌ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషుల‌కు శిక్ష ప‌డ‌టంపై వ‌రుస ట్వీట్ల‌లో అస‌ద్ అనేక ప్ర‌శ్న‌లు సంధించిన సంగ‌తి తెలిసిందే. కేవలం మూడేళ్ల‌లోనే దిల్‌ సుఖ్‌ నగర్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును పూర్తిచేసి నిందితులకు శిక్షపడేలా చేసిన ఎన్‌ ఐఏను గుడ్‌ జాబ్ అంటూ ఒకపక్క అభినందిస్తూనే.. ఎనిమిదేళ్ల‌ క్రితం దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసుల్లో విచారణ జాప్యం కావడంపై అస‌దుద్దీన్‌ విమర్శలు గుప్పించారు. దిల్‌ సుఖ్‌ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషుల వ‌లే 2008 మక్కామసీదు - 2006 మాలేగావ్ - అజ్మీర్ - సంఝౌతా ఎక్స్‌ ప్రెస్ - ముడాసాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎన్‌ ఐఏ ఎందుకింత పురోగతి చూపించలేక పోయిందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా జరిగే బాంబు పేలుళ్ల కేసులన్నింటిని ఒకేకోణంతో చూడాలని - విచారణ కూడా అదేరీతిలో జరుపాలని  అన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూసినప్పుడే వాటిపై, చట్టంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News