కొందరి రాజకీయ నాయకులు తెలివితేటలు చూసినప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది. వారు తీసే లాపాయింట్లు.. లాజిక్కులు సామాన్యుల్ని సూటిగా తాకటమే కాదు.. వారిని కనెక్ట్ అయ్యేందుకు వారు చేసే వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లోని ఒక అంశం మాత్రం అందరిని ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. తెలంగాణ అధికారపక్షంపై అగ్రహం కలిగేలా ఉండటం గమనార్హం.
రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలకు వరాల మీద వరాలు ప్రకటించటమే కాదు.. ఉచిత ఇఫ్తార్ విందులు భారీగా ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన బస్సులకు అదనపు ఛార్జీలు వసూలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
రంజాన్ కోసం కానుకలు ఇచ్చే తెలంగాణ రాష్ట్ర సర్కారు.. గోదావరి పుష్కరాలకు వెళ్లే యాత్రికులకు మాత్రం అదనపు ఛార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజమే.. మైనార్టీలకు రంజాన్ ఎంత పవిత్రమైందో.. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు మిగిలిన వారికి అంతే ప్రాధాన్యత ఇస్తారు కదా. పుష్కరాల సందర్భంగా వరాలు ఇవ్వకున్నా ఫర్లేదు.. ప్రయాణ ఛార్జీలపై అదనపు బాదుడేంది? అన్న ప్రశ్నలు రేకెత్తేలా కిషన్‌రెడ్డి వాదన ఉంది. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు సామాన్యులు ఇట్టే కనెక్ట్ కావటం ఖాయమంటున్నారు.