బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ అధికారపక్షంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? అంటే.. అవునన్న మాటతో పాటు.. కాదన్న మాట వినిపిస్తుంది. కొందరు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని అంటుంటే.. మరికొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వద్దంటే వద్దని చెబుతున్నారట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఒక వర్గం వాదిస్తుంటే.. తెలంగాణ సర్కారు పని తీరు మీద ప్రజల్లో ఉన్న అసహనంతో పాటు.. తమ వాదనను బలంగా వినిపించటానికి ఇదో వేదికగా మారుతుందున్నది కొందరి కాంగ్రెస్ నేతల భావన. ఇదిలా ఉంటే.. అవిశ్వాస తీర్మానం మీద బీజేపీ నేత కిషన్ రెడ్డిని కొందరు అడగటం కనిపించింది. కాంగ్రెస్ ఇచ్చే అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మద్దుతు ఇస్తుందా? అంటూ ప్రశ్నించినప్పుడు.. కిషన్ రెడ్డి తనదైన శైలిలో బదులిచ్చారు.
అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో కాంగ్రెస్ నేతల్లోనే కన్ఫ్యూజన్ ఉందని.. ఇప్పుడున్న బలం దృష్ట్యా (ఎమ్మెల్యేల సంఖ్యను అనుసరించి) తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఉందని.. అయితే.. ఆ నేతల్లో అవిశ్వాసం పట్ల సందిగ్దత ఉందని.. అది తొలిగి ఒకనిర్ణయం తీసుకుంటే.. తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ అధికారపక్షంపైన అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలోనూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అంత కన్ప్యూజన్ ఎందుకు? తాము పెట్టే అవిశ్వాసం వల్ల అయ్యేదేమీ ఉండదు. కనీసం.. తమ వాయిస్ ను బలంగా వినిపించే అవకాశం మాత్రమే ఉంటుంది. తమ గొంతును బలంగా వినిపించేందుకు సైతం తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేరా?