తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ విషయంలో పోలీసులు ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధ వివాదంగా మారుతోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ను ఆపేయటం వివాదంగా మారుతోంది. ప్రోటోకాల్ ప్రకారం.. మంత్రులు ప్రయాణించే సమయాల్లో ట్రాఫిక్ ఆపేయటం ఉండదు.
గవర్నర్.. ముఖ్యమంత్రి.. హోంమంత్రి వరకూ ప్రయాణిస్తుంటే.. ట్రాఫిక్ ఆపేస్తుంటారు. అయితే.. ఇందుకు భిన్నంగా హైదరాబాద్ లోని పలు బస్తీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రి కేటీఆర్ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా ట్రాఫిక్ నిలిపివేయటం ఈ మధ్య తరచూ చోటు చేసుకుంటుంది.
ధీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా మంత్రి కేటీఆర్ వాహన శ్రేణి కోసం ట్రాఫిక్ ఎందుకు ఆపేస్తున్నారని ప్రశ్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. హోంమంత్రికి లేని ప్రోటోకాల్ కేటీఆర్ కు ఎందుకని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.మంత్రి కేటీఆర్ పై కిషన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆయనెలా స్పందిస్తారో చూడాలి.