పోలీస్ సహా కీలక అన్ని శాఖలపై పెత్తనం చెలాయించే హోంశాఖ సహాయ మంత్రినే చంపేస్తామని బెదిరించడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తాజాగా ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా ఓ వ్యక్తి చంపుతానని బెదిరించాడు. అజ్ఞాత వ్యక్తి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అలెర్ట్ అయ్యారు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు.. సదురు ఇంటర్నెట్ కాల్ ఎక్కడి నుంచే వచ్చిందనే దానిపై ప్రాథమిక ఆధారాలు కనుగొన్నారు. కిషన్ రెడ్డి కి బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచాక కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించారు. కీలకమైన హోంశాఖ సహాయమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత ఇటీవలే ఉగ్రవాదులను, ఉగ్రవాదులకు సహకరించే వారికి ఏరిపారేస్తాం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని విమర్శించారు. దీంతో ఆయనను చంపేస్తామని తాజాగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇది ఆకతాయిల పనా.? లేక నిజంగానే ఉగ్రమూకలు కాల్ చేశాయా అన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
* ఇక మల్లారెడ్డిపై ట్రోల్స్.. పోలీసులకు ఫిర్యాదు..
ఇక తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువైపోయాయి. ఫేస్ బుక్ లో అసభ్యకరమైన పోస్టులు వేధింపులు ఎక్కువ కావడంతో మల్లారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్న వ్యక్తుల కంప్యూటర్ ఐపీ అడ్రస్ లను పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు.