ఎమ్మెల్యే.? ఎంపీ.? కిషన్ రెడ్డి చెప్పేశాడు..

Update: 2018-09-18 08:30 GMT
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు.   ఫైర్ బ్రాండ్ కిషన్ రెడ్డి ఈసారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కు పోటీపడతారని చాలారోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ప్రకటనలకు తెరదించుతూ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచే నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రకటించారు.

*కిషన్ రెడ్డి పొలిటికల్ కెరీర్..

కిషన్ రెడ్డి ఇప్పటికి మూడు సార్లు అంబర్ పేట నుంచి వరుసగా గెలుపొందారు. బీజేపీలో ఇలా హ్యాట్రిక్ కొట్టిన మొట్టమొదటి మొనగాడు ఈయనే. 1999లో తొలిసారి కార్వాన్ నుంచి పోటీచేసి కిషన్ రెడ్డి ఓడిపోయాడు. అనంతరం హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి 2004లో పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డి విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో హిమాయత్ సాగర్ రద్దు అయ్యి అంబర్ పేట అసెంబ్లీ కేంద్రంగా ఏర్పడింది. దీంతో 2014లో మూడోసారి అంబర్ పేట నుంచి పోటీచేసి ఏకంగా 69వేల ఓట్ల మెజార్టీతో కిషన్ రెడ్డి గెలిచారు. బీజేపీలో ఆలె నరేంద్ర తర్వాత అంతటి వరుస విజయాలు.. ఘనత పొందిన వ్యక్తిగా కిషన్ రెడ్డి పేరొందారు. కిషన్ రెడ్డి అంబర్ పేట లో వరుస విజయాల వెనుక ఆర్ ఎస్ ఎస్ ప్రోత్సాహం ఉంది. ఈ ఎన్నికల్లోనూ ఆయనను గెలిపించేందుకు ఆర్ఎస్ఎస్ రెడీ అయినట్టు సమాచారం.
Tags:    

Similar News