ప్రమాణ స్వీకారంలో కిషన్ రెడ్డి తడబాటు

Update: 2019-05-30 16:01 GMT
తెలంగాణ ఎంపీ జి. కిషన్ రెడ్డి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అయితే, ప్రమాణపత్రం చదవడంలో కిషన్ రెడ్డి కాస్త ఇబ్బంది పడ్డారు. హిందీలో ఉన్న ప్రమాణపత్రం చదువుతూ పలుమార్లు తడబడ్డారు. దాంతో రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఆ పదాలను కిషన్ రెడ్డితో తిరిగి పలికించారు. దాంతో కిషన్ రెడ్డి ఎలాగైతేనేం ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు.

లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఘనవిజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖాయం అంటూ కొన్నిరోజుల నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంవో నుంచి ఆయనకు ఫోన్ రావడంతో దిల్లీ చేరుకుని మోదీ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

దక్షిణాదిలో కర్నాటక - తమిళనాడుల నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి మోదీ కేబినెట్లో అవకాశం దొరికినా తెలంగాణలో మాత్రం కిషన్ రెడ్డితోనే సరిపెట్టారు. కర్నాకటలో పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చినప్పటికీ తమిళనాడులో మాత్రం బీజేపీ బోణీ కొట్టలేకపోయింది. కానీ, అక్కడ నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి.. కొత్తగా ఎస్‌. జయశంకర్‌‌ కు అవకాశమిచ్చారు.నిర్మలా సీతారామన్ రాజ్యసభ ఎంపీకాగా.. జయశంకర్ ఏ సభలోనూ సభ్యులు కారు. అయినప్పటికీ బీజేపీ ఆయన్ను మంత్రిని చేసింది.  1977లో ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ కు ఎంపికైన ఆయన 2018 వరకు విదేశీ వ్యవహారాల శాఖలో కీలక పదవులు చేపట్టారు. చైనా - అమెరికాల్లో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. 2015 నుంచి 2018 వరకు విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

తమిళనాడుకు అంత ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ఏపీలోనూ ఎవరైనా నాయకులకు అవకాశం ఇవ్వాల్సిందన్న వాదన ఏపీ బీజేపీలో వినిపిస్తోంది


Tags:    

Similar News