రాజధాని పై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Update: 2020-01-07 10:43 GMT
అమరావతి రాజధాని కి ప్రత్యామ్మాయంగా 3 రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ యోచిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హైపవర్ కమిటీ తేల్చాకే దీనిపై ముందుకెళ్తామన్నారు. అమరావతి రాజధాని మార్పు పై ఆందోళనలు తీవ్రమవుతున్న దృష్ట్యా తాజాగా కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

అనంతపురం పర్యటనలో విలేకరులతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజధాని అమరావతి పై కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి రాజధానిపై మీడియా లో వస్తున్న కథనాల ఆధారంగా కేంద్రం స్పందించబోదని తెలిపారు. ఏపీ ప్రభుత్వ పరిధిలోని రాజధాని వ్యవహారమని.. స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాక కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

గతంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీ రాజధాని పై స్పష్టతనిచ్చారు. ఏపీ రాజధాని మార్పు పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. రాజధాని మార్పు అనే విషయం అసలు కేంద్రం పరిధి లోకి రాదని పేర్కొన్నారు. అమరావతి పై ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ ను చేయడానికి రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి రాజధాని మార్పుపై అధికారిక ప్రకటన తర్వాత స్పందిస్తామని తెలిపారు. దీంతో రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదని.. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వివరణ ఇచ్చినట్టైంది.


Tags:    

Similar News