ప్రమాదంలో కోబ్ బ్రియాంట్ మృతి ...షాక్ లో క్రీడా ప్రపంచం !

Update: 2020-01-27 05:20 GMT
యూఎస్‌ లో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదం లో ప్రముఖ బాస్కెట్‌ బాల్ క్రీడాకారుడు కొబ్ బ్రయంట్ మృతి చెందారు. ఆదివారం సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో ఎన్‌ బీఎ లెజెండ్ కోబ్ బ్రయంట్ మరణించారు. కొబ్ బ్రయంట్‌ తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు జియానా కూడా దుర్మరణం చెందింది. హెలికాప్టర్‌ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కొబ్ బ్రయంట్ మృతి తో క్రీడా ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగింది. కోబ్ అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కొబ్ బ్రయంట్ బాస్కెట్‌ బాల్ క్రీడలో ఎంతో సంపాదించారు. కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరియర్‌ లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదు సార్లు ఛాంపియన్‌ గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్‌ గా నిలిచారు. 2016లో ఎన్‌ బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్‌ గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్‌ లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణ పతకాలు అందుకున్నారు.

బ్రియాంట్‌ అకాల మరణం పై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాలు ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్‌ బాల్‌ అభివృద్ది కి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్ర లో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్‌ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ సంతాపం తెలిపుతూ అతడి మరణం ఎన్‌ బీఏకు తీరని లోటని తెలిపింది.


Tags:    

Similar News