జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి .. మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్లు చేశారు. గతంలో యాక్టర్ యాక్టర్ అంటూ.. వ్యాఖ్యానించి.. రాజకీయంగా విమర్శలు గుప్పించిన మంత్రి కొడాలి .. ఇప్పుడు నేరుగా పవన్ పేరుతో విమర్శలు రువ్వారు. ``జనసేన అధినేత అని చెప్పుకొంటాడు. కానీ.. పది ఓట్లు కూడా పడలేదు. ఎందుకు ఆయనకు రాజకీయాలు.. వెళ్లి సినిమాలు తీసుకుంటే సరిపోతుంది. అవైనా.. తృప్తినిస్తాయి. అభిమానులు పెరుగుతారు. ఆయన చేసేవి ఉత్తుత్తి దీక్షలే.. వాటిని ఎవరూ నమ్మరు. కేంద్రంలోని బీజేపీ పొత్తు అంటాడు. అక్కడికి వెళ్లి మాట్టాడొచ్చుగా..ఇక్కడ ఉడత ఊపులు ఊపి.. జగన్‌పై విమర్శలు చేయడం ఎందుకు?`` అని ప్రశ్నించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. ఆర్బీకే సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. రంగు మారిన ధాన్యాన్ని రేటు తగ్గకుండా కొంటామన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వైసీపీ నాయకులు ఏమీ అనకున్నా అన్నారని చంద్రబాబు ప్రచారం చేశారని చెప్పారు. పెళ్లాన్ని ఎవరైనా తిడితే.. గ్రామస్థాయికి వెళ్లి ప్రచారం చేసుకుంటారా? అందుకే.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందని అంటున్నా.. అని వ్యాఖ్యానించారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది కేంద్రమేనని ఆయన చెప్పారు. విశాఖ ఉక్కును ఎలా నిలబెట్టాలో.. ఈ విషయంలో తాము ఏంచేయాలో తమకు తెలుసన్నారు. విశాఖ ప్లాంట్‌పై కేంద్రాన్ని నిలదీసే దమ్ము పవన్‌కు లేదని విమర్శించారు.
అదే సమయం లో జనసేన లో పట్టుమని కూడా పది మంది లేరని.. ఉంటే ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని అన్నారు. పవన్ చేసే పిచ్చి పనులకు.. ఆ పార్టీ నేతలే తిరగ బడే రోజులు త్వర లోనే వస్తాయన్నారు. ఆయన చేసే ఉత్తుత్తి దీక్షలకు ఇక్కడ ఎవరూ కదిలి పోరని.. ఎవరు ఏంటో ప్రజలకు తెలుసు నని చెప్పారు. వచ్చే 2024 ఎన్నికల గురించి మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా.. వైసీపీదే విజయం ఖాయమని చెప్పారు.. గత ఎన్నికల కంటే..కూడా ఎక్కువ గానే సీట్లు సాధిస్తామన్నారు. ఈ విషయం లో తమకు క్లారిటీ ఉందని.. క్లారిటీ లేని పార్టీల గురించి తాము మాట్లాడి ప్రయోజనం ఏం ఉంటుందని వ్యాఖ్యానించారు. పవన్ పార్టీ కన్నా.. సినిమాల పై దృస్టి పెడితే.. ఫ్యూచర్ ఉంటుందని సలహా ఇవ్వడం కొసమెరుపు.