మరోసారి ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకులపై విరుచుపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. వారితో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమను తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎన్నికల కమిషనర్ తొలగింపుపై అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం రాజుకుంది. లాక్ డౌన్ అమలులో నిర్లక్ష్యం - ఎన్నికల కమిషనర్ మార్పు వంటి అంశాలపై చంద్రబాబు - మాజీమంత్రి ఉమ సీఎం జగన్ ను తీవ్ర విమర్శలు చేశారు. వారి విమర్శలపై మంత్రి కొడాలి నాని ప్రతిదాడి చేశారు. సీఎం జగన్ ను ఏకవచనంతో మాట్లాడితే మూతి పగలగొడతానని హెచ్చరించారు . ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేశ్ కుమార్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అని - తన తొత్తు - కాలి చెప్పును తీసుకొచ్చి చంద్రబాబు ఎన్నికల అధికారిగా పెట్టుకున్నారని తీవ్ర విమర్శించారు.
కరోనా వైరస్ పై ప్రజలు - ప్రభుత్వం పోరాటం చేస్తుంటే కలిసి రాకపోగా హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఐదేళ్లు సీఎంగా చంద్రబాబు చేసింది ప్రచార ఆర్భాటం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. హైదరాబాద్ లో కూర్చుని నాటకాలు ఆడటం కాదని చంద్రబాబు తీరును ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎన్నికల కమిషనర్ గా ఉన్న రమేశ్ కుమార్ ను తప్పించి రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను నియమించామని తెలిపారు. ఎన్నికల సంఘం తన అయ్య జాగీరు అన్నట్టుగా సీఎస్ - డీజీపీలతో చర్చించకుండా కమిషనర్ గా ఉన్న రమేశ్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారని గుర్తుచేశారు.
రమేశ్ కుమార్ ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఎన్నికల కమిషనర్‌గా తొలగించబడ్డారని తెలిపా. ఈ సందర్భంగా దేవినేని ఉమపై కూడా మంత్రి నాని విమర్శల దాడి చేశారు. ఎమ్మెల్యే కావడం కోసం తన సొంత వదినను చంపిన చరిత్ర దేవినేని ఉమది అని వ్యక్తిగత విమర్శలు చేశారు. ఉమకు ఏ అర్హత ఉందని సాగునీటి మంత్రిగా పని చేశారని నిలదీశారు . అయితే కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ ను సోషల్ మీడియాలో మతం రంగు పులిమి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.