మాటకు మాట అనేయటం ఇప్పుడో ట్రెండ్. ఎదుటోడు ఎంత పెద్దోడైనా కావొచ్చు.. చుక్కలు తీరు ఇప్పుడో అలవాటుగా మారింది. తాజాగా ఏపీ విపక్ష నేత చంద్రబాబునుఉద్దేశించి.. ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర మంత్రలు కొడాలి నాని.. మరో మంత్రి పేర్ని నాని. తాజా అమరావతి పర్యటనలో విపక్ష నేత చంద్రబాబు అక్కడి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడటమే కాదు.. ఆ సందర్భంగా అధికార వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీది ఫేక్ పార్టీ అంటూ ఆయన మండిపడ్డారు.
దీనిపై మంత్రులు మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబుది ఫేక్ జాతీయ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ లో ఓడి ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకు చేరి.. ఆయనకే వెన్నుపోటు వడిచారని నిప్పులు చెరిగారు. అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. రైతుల్ని మోసం చేశారన్నారు. పద్నాలుగేళ్లు అధికారంలో ఉండి.. దుర్గమ్మకు ఎప్పుడైనా పట్టువస్త్రాల్ని సమర్పించారా? అని ప్రశ్నించారు.
బాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంద్ర కీలాద్రిలో క్షుద్ర పైజలు చేయించారన్నారు. ఈ కారణంతోనే అమ్మవారి శాపంతో బాబు 23 సీట్లకు పరిమితమయ్యారన్నారు. దుర్గమ్మ రాబోయే రోజుల్లో చల్లగా చూస్తే.. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సహకార సంస్థ నాశనం చేయటానికి.. హెరిటేజ్ కు అన్ని కోట్లు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు.
మొన్నటి ఎన్నికల్లో లోకేశ్ ను ఓడించారని.. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. హెరిటేజ్ కంపెనీ కోసం సహకార వ్యవస్థను పణంగా పెట్టారన్నారు. ‘‘బాబుకు సిగ్గు శరం లేదు. హెరిటేజ్ కు అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?’’ అని ప్రశ్నించారు. పందికొక్కుల మాదిరి గ్రామీణ పేద మహిళల డబ్బులు దోచేశారని నిప్పులు చెరిగారు కొడాలి నాని.
అనంతరం మరో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. దేవుళ్లతో నాటకాలు ఆడితే తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఎవరైనా భూదేవితో నాటకాలు ఆడితే.. మట్టిగొట్టుకుపోతారన్నారు. పేదలకు సాయం చేస్తుంటే.. అడ్డుపడుతున్నది చంద్రబాబేనని మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఆయన.. ‘చంద్రబాబు చౌదరి’ అని పిలవటం గమనార్హం. బాబుపై ఉన్న అన్ని స్టేలు ఎత్తివేసే రోజు త్వరలోనే వస్తుందన్నారు. మొత్తానికి బాబును ఇంత దారుణంగా తిట్టినోళ్లు ఉండరని చెప్పక తప్పదు.రానున్న రోజుల్లో ఈ తరహాలో మరెన్ని మాటలు బాబు పడాల్సి ఉంటుందో?