ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నేతల్లో కొడాలి నాని ఒకరు. సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న ఆయన ఆ మధ్యన జగన్ పార్టీలో చేరటం తెలిసిందే. చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించాలంటే నానికి మించినోళ్లు మరొకరు ఉండరన్న పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో తన మాజీ బాస్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయ నోరు తెరిస్తే చాటు.. బాబు అండ్ కో నోటి వెంట మాటలు బంద్ అయ్యేంత ఘాటుగా స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి బాబుపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు తరచూ అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు లాంటి అతి భయంకర రాక్షసుడ్ని తానిప్పటివరకు చూడలేదన్నారు. లోక కల్యాణం కోసం రుషులు యజ్ఞం చేస్తుంటే.. రాక్షసుడి తరహాలో బాబు అడ్డు పడుతున్నారన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని సమంగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్నిచూసి చంద్రబాబు తట్లుకోలేకపోతున్నారని.. అందుకే ఏదోలా వాటిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న జగన్ చిత్తశుద్దిని బాబు చెడగొడుతున్నారన్నారు. ప్రజల గుండెల్లో జగన్ ఎక్కడ దేవుడైపోతాడన్న భయంతోనే విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తరచూ ఘాటు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ నిలిచే కొడాలి.. తన తాజాగా వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి వచ్చారని చెప్పాలి. బాబును ఈ తరహాలో విమర్శలతో ఉతికి ఆరేయటంలో ఈ మాజీ తమ్ముడికి సాటి వచ్చే నేత ఉండరంటున్నారు.