తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మరోమారు తెలంగాణ ప్రభుత్వంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రజా సంఘాల అవసరం ఇక ముగిసినట్లేనని అందరూ భావిస్తున్నా, వీటి అవసరం ఇంకా మిగిలే ఉందని తేటతెల్లం చేశారు. తెలంగాణకు మకుటాయమానమైన జాతి సంపద రాజకీయ నాయకులు - పాలకుల వల్ల దోపిడీకి గురవుతోందని, దీనిని కాపాడుకునేందుకు పౌరవేదికలు నడుంబిగించాలని కోదండరాం ఉద్బోదించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజాసమస్యలను భుజాలకెత్తుకుని, వాటిని వెలుగులోకి తెచ్చే బాధ్యత పౌరవేదికలదేనని కోదండరాం చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాల పాత్ర అమోఘమని కోదండరాం కొనియాడారు. గతంలో సిద్దించిన కొత్తరాష్ట్రాల్లో ప్రజా సంఘాల భాగస్వామ్యం లేకపోవటంతో ఆయా చోట్ల రాజకీయపార్టీల ఆధిపత్యం పెరిగి, ప్రజాసంక్షేమంపై నిర్లక్ష్యం విస్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకు పౌరవేదికలు పనిచేయాలని, జనసమస్యల పరిష్కారంలో రాజకీయాల పాత్రను ఎత్తిచూపుతూ ముందుకు సాగాలన్నారు. వనరుల దోపిడిని కాపాడటం ఇందులో ముఖ్యమైనదని కోదండరాం అన్నారు. సగానికి పైగా భూములకు నీటినందించే మద్యమానేరు నిర్మాణంపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇంత జరిగినా సదరు గుత్తేదారుకు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించటం వెనుక ఆంతర్యమేంటని కోదండరాం సూటిగా ప్రశ్నించారు. సమస్యలపై స్పందించటం పౌరుల హక్కని, వీటి నుంచి ప్రజలను విముక్తి చేయటం అందరి బాధ్యత అని గుర్తుచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/