తెలంగాణ ఏర్పడిన తర్వాత మౌనంగా ఉంటూ.. ఎలాంటి పదవులు తీసుకోకుండా.. ఒక ఉద్యమ నాయకుడిగా మిగిలిన పోయిన ఉద్యమ అగ్రనేతల్లో ముందుంటారు కోదండం మాష్టారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతగానో శ్రమించిన ఆయన.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. బంగారు తెలంగాణ కోసం అందరూ ఏకం కావాలంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు ఆయన పెద్దగా స్పందించింది లేదు.
గడిచిన 14 నెలల కాలంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అప్పుడప్పుడు కాసింత అసంతృప్తిని.. కొన్నిసందర్భాట్లో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన కోదండం మాష్టారు తాజాగా మరో ఉద్యమ పిలుపు ఇచ్చారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన ఇంకా పూర్తి కాలేదని.. ప్రత్యేక హైకోర్టు కోసం మరో ఉద్యమం చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు కోసం..ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కోదండరాం.. ఉద్రేకపూర్వకంగా మాట్లాడటం గమనార్హం.
ప్రత్యేక హైకోర్టు డిమాండ్ ఒక్క న్యాయవాద వర్గాలకు మాత్రమే పరిమితం కాకూడదని.. దీని కోసం తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమ బాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని పలు అంశాల్ని ఆయన ప్రస్తావించారు. మరి.. ప్రత్యేక హైకోర్టుపై కోదండం మాష్టారు ఇచ్చిన పిలుపు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.