శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పలు రాజకీయ పార్టీలలో వ్యూహ - ప్రతివ్యూహాలు - చర్చోపచర్చలు ఎక్కవవుతున్నాయి. అలాగే వ్యక్తుల ప్రభావంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మేథావి - తెలంగాణ జన సమితీ నాయకుడు ప్రోఫెసర్ కోదండరామ్ ప్రభావం ఏ పార్టీ మీద ఎంతుంటున్నది ప్రధాన చర్చగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులను - ప్రజలను సమీకరించడంలో కోదండరామ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. రాజకీయ సంయుక్త కార్యచరణ సమితీ (జేఏసీ) ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉరకలు పెట్టించారు.
సకలజనుల సమ్మే - వంటా వార్పు - తెలంగాణ మార్చ్ వంటి కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కించారు. ఒక దశలో తెలంగాణ రాష్ట్ర సమితీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కంటే ఎక్కువగానే ప్రజలలోకి వెళ్లారు. తెలంగాణ ఏర్పడి కొన్ని నెలల సొంత పాలన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసారు.తెలంగాణలో కేసీఆర్ పాలన దొరల పాలనలాగే ఉందంటూ మండిపడ్డారు. ఆ తర్వాత సొంత పార్టీనే ఏర్పాటు చేసారు. ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించి కోదండరామ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. అయితే తెలంగాణలోని పట్టాణాలు - నగరాలలో ఆయన ప్రభావం మాత్రం చాలనే ఉంటుంది. ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితీకి ఎంత మేరాకు చేటు తెస్తుందో చూడాలి.
అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకూ మేలు చేస్తుందో కూడా తేలాలి. ఉద్యోగులు - రైతులలో కోదండరామ్ నింపిన ఉద్యమ స్పూర్తి వచ్చే ఎన్నికల వరకూ ఉంటే దాని ప్రభావం తెలంగాణ రాష్ట్ర సమితీపై పడటం ఖాయం. కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశం కోదండరామ్ పార్టీకి ఉండదు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకోనుంది. ఈ పొత్తుకు కోదండరామ్ అంగీకరించరు. ఆయన ద్రుష్టిలో తెలుగుదేశం పార్టీ నూటికినూరు పాళ్లూ ఆంధ్రుల పార్టీ. దీంతో కోదండరామ్ కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు లేవు. ఆయన విడిగా పోటి చేస్తే ఆ ప్రభావం టిఆర్ ఎస్ పైనే ఎక్కువగా పడే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ లాభపడవచ్చు.