మళ్లీ మిలియన్ మార్చ్ కు రెడీ అయిన కోదండరాం

Update: 2021-01-05 01:30 GMT
తెలంగాణ ఉద్యమకాలంలో జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో హైదరాబాద్ లో నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ ఉద్యమ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోయింది. నాడు తెలంగాణలోని సకల జనులు పాల్గొన్న ఈ మహా ఉద్యమం సూపర్ హిట్ అయ్యింది. తెలంగాణ కదిలింది. ఆ కోవలోనే రాష్ట్రం సిద్ధించింది.

అయితే తెలంగాణ వచ్చాక కూడా ఇంకా ఏదో అసంతృప్తి. ఆ అసంతృప్తి తాజాగా పోరుబాటు పట్టారు అదే ప్రొఫెసర్ కోదండరాం. ఇప్పుడు తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఆయన లీడ్ తీసుకుంటున్నాడు.

రైతులు, నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాజాగా కోదండరాం చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు కరోనా కల్లోలంగా ఈ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని.. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగ ప్రకటనను కేసీఆర్ ఇవ్వలేదని.. టీచర్లు, లెక్చరర్ల సమస్యలు తీర్చలేదని ఆయన విమర్శించారు.

తెలంగాణలోని సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడుదామని కోదండరాం పిలుపునిచ్చాడు. ఈనెల 20 వరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు, చివరగా చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఫిబ్రవరి మూడో వారంలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. మరి నాటి స్పందన ఇప్పుడు వస్తుందా? రాదా అన్నది వేచిచూడాలి.


Tags:    

Similar News