ఉద్యమం నడపటం వేరు.. రాజకీయాలు వేరు. ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేయటం ఉద్యమ సహజ లక్షణం. కానీ.. రాజకీయం అలా ఉండదు. కొన్నిసార్లు అప్పటివరకూ చెప్పిన మాటల్ని అప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది.
అప్పటివరకూ వ్యతిరేకించిన వారితో కలిసి వెళ్లాల్సి ఉంటుంది. సిద్ధాంతాలకు.. ప్రాక్టికల్ గా జరిగే పరిణామాలకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఇలాంటి విషయాల్ని సగటు రాజకీయ నేతలు బాగానే డీల్ చేస్తారు.కానీ.. జీవితాంతం తనదైన రీతిలో బతికిన కోదండం మాష్టారి లాంటోళ్లకు మాత్రం మహా ఇబ్బంది.
దశాబ్దాల పాటు తాను గిరి గీసుకున్న వృత్తాల్ని దాటేసి రావాల్సి ఉంటుంది.ఈ సందర్భంగా పడే సూటిపోటి మాటలెన్నో. అయితే.. అంతిమ లక్ష్యానికి చేరుకోవటం కోసం ఇలాంటి అవస్థలెన్నో పడాల్సిందే. ఇలాంటివి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న కోదండం మాష్టారికి.. ఇప్పటికి ఆయన నిత్యం భావ సంఘర్షణకు లోనవుతున్నట్లుగా చెబుతున్నారు.
తన భావజాలానికి పూర్తిగా భిన్నమైన బాబుతో కలిసి అడుగులు వేయటం.. మహాకూటమిలో ఉండాల్సి రావటం కోదండం మాష్టారికి మహా ఇబ్బందిగా మారింది. అదే సమయంలో కూటమికి ఆభరణంగా మారిన కోదండం మాష్టారిని కూటమి నుంచి బయటకు తెచ్చేస్తే చాలు.. తన పని సులువు అవుతుందన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీంతో.. కంటికి కనిపించని ఆసక్తికరమైన రాజకీయ ఎత్తుగడలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అధినేతకు ఇచ్చిన కమిట్ మెంట్‌కు తగ్గట్లు కోదండం మాష్టారి అడుగులు పడుతున్నాయి. అయితే.. బాబుతో కలిసి కూటమిలో కొనసాగటం ఆయన మహా ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు.
కూటమి నుంచి బయటకు వచ్చేద్దామంటే దాని కారణంగా కేసీఆర్ బలపడటం తప్పించి మరింకేమీ ఉండదు. తనకు తానుగా ఏమీ చేయలేని బలహీనత గురించి కోదండం మాష్టారికి అవగాహన లేక కాదు..అయితే.. ఉంటే ఒక బాద.. ఉండకుండా ఉంటే మరో బాధ అన్నట్లుగా మారింది. ఆయన గురించి బాగా తెలిసిన ఆయన సన్నిహితులు తాజా పరిస్థితి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
అదేదో పవన్ సినిమాలో మాదిరి కనిపించని శత్రువుతో పోరాడుతున్నా అని చెప్పే డైలాగును కాస్త మార్చేసి.. కనిపించే శత్రువు కళ్ల ముందు ఉన్నా.. వారితో కలిసి కూర్చోవాల్సి వస్తుందే? అన్నది కోదండం మాష్టారి ఇబ్బందిగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. బాబుతో కలిసి కూటమిలో కొనసాగటం మాత్రం కోదండం మాష్టారికి చుక్కలు కనిపిస్తున్నాయట.