కోదండ‌రాం ఆధ్వ‌ర్యంలో దిన‌ప‌త్రిక-వెబ్ సైట్‌

Update: 2016-11-16 06:01 GMT
తెలంగాణ ఉద్యమం - రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న జేఏసీ చైర్మ‌న్ ఫ్రొఫెస‌ర్ కోదండరాం మ‌రో రూపంలో మ‌రింతగా చేరువ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌ను ఏకం చేసిన ప్ర‌త్యేక‌త సాధించిన కోదండరాం ఇపుడు అధికార ప‌క్షానికి దూరంగా స‌రిగా చెప్పాలంటే వ్య‌తిరేకంగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో మిగ‌తా విప‌క్షాల‌కు కోదండ‌రాం మ‌రింత స‌న్నిహితంగా మారుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ స‌ర్కారు ప‌నితీరుకు నిర‌స‌న‌గా రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర నెల‌రోజులు పూర్త‌యిన‌ సంద‌ర్భంగా వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన సభ‌లో ప్ర‌సంగించిన కోదండ‌రాం ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేసేందుకు జేఏసీ ముందుకు సాగుతున్న‌ట్లు కోదండరాం ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో జేఏసీ బలోపేతానికి జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని - ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. త‌మ ఆందోళ‌న‌కు అక్ష‌ర రూపం ఇచ్చేందుకు జేఏసీ త‌ర‌ఫున పత్రిక - డిజిట‌ల్ మాధ్య‌మంలో చేరువ అయ్యేందుకు వెబ్‌ సైట్‌ ప్రారంభించనున్నట్లు కోదండరాం ప్ర‌కటించారు. వైబ్‌ సైట్‌ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. ఇదిలాఉండ‌గా పెద్ద నోట్ల రద్దు-అవినీతి విష‌యంలో అదే రీతిలో కోదండ‌రాం సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. అవినీతికి వ్య‌తిరేకంగా నోట్ల ర‌ద్దు నిర్ణ‌యమంటున్న కేంద్ర ప్ర‌భుత్వం డ‌బ్బుల‌పైనే కాకుండా స్థిర‌ - చ‌రాస్తుల‌పైనా దృష్టిసారించాల‌ని కోరారు. క‌రెన్సీ రూపంలోనే కాకుండా బంగారం - పెద్ద ఎత్తున భూముల రూపంలో కూడా అనేక‌మంది బ్లాక్ మ‌నీ పోగుబ‌డి ఉందని కోదండ‌రాం అన్నారు. వీటిపై చ‌ర్య తీసుకుంటేనే పూర్తి స్థాయిలో అక్ర‌మ సంపాద‌న‌కు అడ్డుక‌ట్ట వేసిన‌ట్లు అవుతుంద‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను అవ‌స‌రాలు - నిర్వాసితుల కోణంలో నిర్మించాల‌ని కోరారు. పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని నీటి అంచ‌నాల ఆధారంగా కాకుండా నీటిల ల‌భ్య‌త‌ను బ‌ట్టి నిర్మించాల‌ని కోదండ‌రాం రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News