ఓ వైపు పొత్తు పొడవలేదు. సీట్ల సర్దుబాటు తేలలేదు. మహాకూటమిగా ఏర్పడ్డారు సరే.. ఇంకా ఎవ్వరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్సెన్స్ గా మారింది. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారపర్వానికి తెరలేపారు. ఈరోజు భైంసా - కామారెడ్డి- హైదరాబాద్ లలో మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మరి మహాకూటమి నేతలందరూ ఈ సభలకు హాజరవుతారా.? లేదా అన్నది సస్సెన్స్ గా మారింది.
రాహుల్ తో కలిసి బహిరంగ సభల్లో పాల్గొనడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూటమిలోని భాగస్వామ్య పార్టీ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను ఒప్పించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ నాన్చివేస్తూ సీట్ల సర్ధుబాటుపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో కోదండరాం అలక వహించినట్టు సమాచారం. అందుకే ఆయన రాహుల్ సభలకు హాజరుకావడం లేదట.. ఈ పరిణామం కూటమి అస్తిత్వానికి శరాఘాతం అవుతుందని.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెలువడుతాయని కాంగ్రెస్ అధినాయకత్వం ఆందోళనగా ఉందట..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రాహుల్ సభల్లో పాల్గొనాలని కోదండరాంను కోరారట.. మహాకూటమి ఐక్యంగా ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాహుల్ సభలు ఉపయోగపడతాయని.. కలిసి రావాలని విన్నవించారట.. అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ నాన్చుతూ అన్యాయం చేస్తోందని.. కూటమిలో తమకు సీట్లు కేటాయింపు పూర్తయిన తర్వాతే తాను ఉమ్మడి సభల్లో పాల్గొంటానని కోదండరాం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.
మహాకూటమిలో తన టీజేఎస్ పార్టీకి 15-17 సీట్లు కావాలని కోదండరాం డిమాండ్ చేస్తున్నారట.. కానీ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మాత్రమే ఇస్తానని చెబుతోందట.. కూటమిలోని పెద్ద పార్టీలు టీడీపీ - సీపీఐలు ఎక్కువ కోరుతున్నాయని.. వాటి తర్వాతే టీజేఎస్ కు సీట్ల కేటాయింపు చేస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారట.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కోదండరాం.. సీట్లు తగ్గితే అవసరమైతే కూటమి నుంచి బయటకు వచ్చి విడిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు టీజేఎస్ కు గుర్తును త్వరలో కేటాయించబోతోందని.. అందుకే తాము కాంగ్రెస్ గుర్తుపై పోటీకి దిగమని కోదండరాం స్పష్టం చేశాడట.. అందుకే సీట్లు తేలేదాకా.. కలిసి ప్రచారానికి కోదండరాం నో చెప్పాడట..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పాల్గొనే సభలు బైంసాలో మద్యాహ్నం 1.30కు - కామారెడ్డిలో 2.30కు - హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ సభల ద్వారా కాంగ్రెస్ తో కలిసే కూటమి నేతలు ఎంతమందనేది ఈ రోజు తేలనుంది.