తెలంగాణ ముందస్తు ఎన్నికల బరిలో నిలచిన పార్టీలు - స్వతంత్రులు మేనిఫెస్టోలతో అదరగొడుతున్నారు. ప్రజలకు అది చేస్తాం - ఇది చేస్తాం అంటూ హమీల వర్షం కురిపిస్తున్నారు. మహాకూటమిలో భాగస్వామ్య పార్టీయైన తెలంగాణ జన సమితి పొత్తులో ఎనిమిది స్దానాలు దక్కించుకుంది. కానీ అందులో నాలుగు చోట్ల రెబల్స్ పోటీ చేస్తున్నారు. అంటే వాస్తవానికి దక్కింది. నాలుగే. మరో 12 చోట్ల స్నేహపూర్వక పోటీ పేరుతో కూటమిలోని పెద్దన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జన సమితిపై పోటీ చేస్తోంది. ఈ స్నేహపూర్వక పోటీ ఏమిటో ప్రజలకు అర్దంకాక తలలు పట్టుకుంటున్నారు. ఏతావాతా తెలంగాణ జన సమితి పోటీ చేసేది నాలుగు స్దానాలే అని తేలిపోయింది. అయిన తెలంగాణ వ్యాప్తంగా ఏం చేస్తామో తెలియజేసే మేనిఫేస్టొ విడుదల చేసింది. నాలుగు స్దానాల పార్టీకి రాష్ట్ర వ్యాప్త మేనిఫేస్టో ఏమిటని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా 14 స్దానాలు దక్కించుకుని 13 స్దానాలలో పోటీ చేసి - 12 స్దానాలకు పరిమితం అయ్యింది. అయిన ఈ పార్టీ కూడా తన సొంత మేనిఫేస్టోను విడుదల చేసింది. ప్రగతి భవన్ ను ఏకంగా ప్రజా వైద్యశాలగా మారుస్తానని ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో పెద్దన్నగా వ్యవహరిస్తూనే చిన్నపార్టీల ఉనికిని దెబ్బ తీస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పోటీ చేస్తున్న స్దానాలు తక్కువే అయిన మేనిఫెస్టోలు మాత్రం భారీగానే ఉండడంతో వీటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీస అవకాశం లేకుండా ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు మేనిఫేస్టోల పేరుతో ప్రజలని అమాయకుల్ని చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
తాము గెలిచిన స్దానాలలో మేనిఫేస్టోలను అమలు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. మహాకూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా మేనిఫేస్టోలో హామీలను నెరవేర్చడం అసాధ్యమని చెబుతున్నారు. మహాకూటమిలో కలవడానికి ముందే సీట్లు - సర్దుబాటులు చేసుకుని ఆ తర్వాత మేనిఫేస్టోలు విడుదల చేయాలని సూచిస్తున్నారు. అలా కాకుండా ముందుగా మేనిఫెస్టోలు విడుదల చేయడం వలన ప్రజలలో చులకన భావం ఏర్పడుతుందని, తెలంగాణ జన సమితి - తెలుగుదేశం పార్టీల పరిస్ధితి ప్రస్తుతం అలాగే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.