తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఓ వైపు ఆయన సన్నద్ధమవుతున్న నేపథ్యంలో...సొంత పార్టీ నేతలు అనుమానపు చూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలకు కొనసాగింపుగా రేవంత్ రెడ్డికి షాకింగ్ ట్విస్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఆయనకు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ గట్టి షాకిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని పలువురు టీడీపీ జడ్పీటీసీలు - ఎంపీటీసీలు అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ సాయంత్రం గం. 4.30కి మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరు కారెక్కబోతున్నారు. దీంతో తాను పార్టీ మారుతుంటే తన వెంట వస్తారని...అండగా ఉంటారని భావించిన సొంత నియోజకవర్గ ఎంపీటీసీ - జెడ్పీటీసీలు ఇలా తాను నిత్యం నిప్పులు చెరిగే టీఆర్ ఎస్ పార్టీలో చేరడం రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం.