ఆ మధ్యన మహేశ్ మూవీ బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుందిగా. అందులో హీరో పేరు సూర్య. తనను తాను సూర్య భాయ్ గా మార్చేసుకున్న అతగాడు.. దేశ ప్రజలు అన్ని పన్నులు కట్టినట్లుగా సూర్యాభాయ్ పన్ను కట్టాలంటూ డిసైడ్ చేయటమే కాదు.. అలా ఇవ్వనోళ్ల సంగతి చూస్తానని చెప్పే మాటలు విని.. సినిమాల్లోనే ఇలాంటి సీన్లు అనుకున్నోళ్లు ఎంతోమంది.
అయితే.. సినిమాలు సైతం.. రియల్ సీన్లు చూసి.. వాటికి కాసిన్ని మార్పులు చేసి తయారు చేస్తారన్న భావన తాజాగా తెర మీదకు వచ్చిన కోడెల ఫ్యామిలీ వారి కే ట్యాక్స్ ఉదంతాన్ని చూసినంతనే గుర్తుకు రాక మానదు. గౌరవనీయమైన హోదాలో ఉన్న తండ్రి పలుకుబడితో కుటుంబ సభ్యులు చేసిన ఆరాచకానికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తీరు తెలుగు ప్రజల నోట మాట రాని పరిస్థితి.
నిత్యం నీతివంతమైన పాలనను అందిస్తున్నట్లుగా ఐదేళ్ల పాటు డప్పాలు కొట్టటమే కాదు.. ఇప్పుడు కూడా తప్పును ఒప్పుకోని బాబు.. కే ట్యాక్స్ ఇష్యూను ఎందుకు పసిగట్టనట్లు? తమ హవా ఉన్న ప్రాంతాల్లో అదే పనిగా సెటిల్ మెంట్లు.. దందాలు చేసిన వైనం పై బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
ఇటీవల కాలంలో మరే రాజకీయ నేత కుటుంబం మీదా ఇన్ని ఆరోపణలు విన్నది లేదు. సామాన్యులు.. మధ్యతరగతి.. సంపన్నులు అన్న తేడా లేకుండా దొరికినోళ్లను దొరికనట్లు చందంగా బెదిరింపులకు గురి చేసి వసూలు చేసిన మొత్తాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వచ్చి.. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న వారు.. బిజినెస్ మాన్ సినిమా కోడెల ఫ్యామిలీ మీద ఇంత ఎఫెక్ట్ చూపించిందా? అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.