అవకాశం వచ్చినప్పుడు అల్లుకుపోవాలి. సరిగ్గా అదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి సరికొత్త ఇమేజ్‌ను తీసుకురావాల్సిన పరిస్థితుల్లో.. చేజిక్కిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి ఏపీ సర్కారు సిద్ధంగా లేదు.
ఇప్పటివరకూ ఏ పెద్ద కార్యక్రమం జరిగినా ఉమ్మడి రాష్ట్రంలో వేదిక హైదరాబాద్ ఉండేది. విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్‌తో పోల్చి చూసినప్పుడు.. ఏపీలోని మరే ప్రాంతం అలా ఉండదన్న అభిప్రాయం కొంతమేరకు నిజమే అయినా.. ప్రత్యామ్నాయం ఉందన్న విషయాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో తాజాగా స్పీకర్ల సదస్సును ఏపీలో నిర్వహించటం తెలిసిందే.
13 దేశాలకు చెందిన ప్రతినిధులతో.. దేశీయంగా పలు రాష్ట్రాలకు చెందిన స్పీకర్లతో విశాఖలో సదస్సును విజయవంతంగా నిర్వహించారు. ఎనిమిది అంశాలపై సమగ్ర చర్చ జరిపి.. సక్సెస్‌ఫుల్‌గా సమావేశాన్ని పూర్తి చేసిన నేపథ్యంలో.. ఒక జాలీ ట్రిప్‌ని ఏపీ స్పీకర్ కోడెల ఏర్పాటు చేశారు. సదస్సుకు వచ్చిన అతిధులకు అరకు అందాలు చూపించాలని ప్లాన్ చేశారు.
ఏపీలోఎంత వైవిధ్యమైన ప్రకృతి అందాలు చూపించటంతో పాటు.. బ్రాండ్ ఏపీని పర్యాటకపరంగా ప్రమోట్ చేసుకోవటానికి వీలుగా ఈ విహారయాత్ర ప్లాన్ చేశారంటున్నారు. దాదాపు 30 మంది ప్రతినిధులకు అరకు అందాల్ని ఏపీ స్పీకర్ చూపించనున్నారు.