రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎంత తొందరగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దామా అని ఎదురుచూస్తున్న స్పీకర్ కోడెల - పలువురు నాయకులకు పదేపదే నిరాశ ఎదురవుతోంది. గత ఏడాదే సమావేశాలు గుంటూరులో నిర్వహించాలనుకున్నా అప్పట్లో వీలు కాలేదు. ఈసారి శీతాకాల సమావేశాలు మాత్రం కొత్త రాజధాని అమరావతిలో నిర్వహించడం ఖాయమనుకున్నారు. తాత్కాలిక ఏర్పాట్లతో సభ నిర్వహించాలని భావించారు. అయితే... హఠాత్తుగా నిర్ణయం మారిపోయింది. శీతాకాల సమావేశాలు హైదరాబాద్ లోనే జరుగుతాయని తేల్చారు.
విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇద్దరి మధ్య చాలాసేపు చర్చ జరిగింది. ఈ చర్చలో శీతాకాల సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను హాయ్ ల్యాండ్ లో నిర్వహించాలని, దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకుంటుండడంతో ఇక్కడ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కూడా అనుమానమేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో కొత్త రాజధానిలో పక్కాగా అసెంబ్లీ నిర్మాణం పూర్తయితే తప్ప మోక్షం లభించదని పలువురు పేర్కొంటున్నారు.