కోహ్లీ గొప్ప మనసు.. మహిళా క్రికెటర్​ కు ఆర్థికసాయం..!

Update: 2021-05-20 07:30 GMT
కరోనా కష్టాలు సామాన్యులతోపాటు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ప్రస్తుతం దేశంలో అత్యంత దయనీయ పరిస్థితి నెలకొని ఉంది. కరోనా విపత్తును ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపారంగా మార్చేసుకున్నాయి. మధ్యతరగతి ప్రజలు తమ ఆస్తులు అమ్మి.. ఆస్పత్రి బిల్లులు కట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. హైదరాబాద్​ కు చెందిన మాజీ మహిళా క్రికెటర్​ స్రవంతి కుటుంబసభ్యులకు కరోనా సోకింది. స్రవంతి తల్లి ఆస్పత్రిలో చికిత్సలో తీసుకుంటున్నది. ఆమెకు రోజుకు లక్షల్లో ఆస్పత్రి బిల్లు అవుతున్నది. ఈ క్రమంలో స్రవంతికి సాయం చేసేందుకు పలువురు క్రీడా కారులు ముందుకొచ్చారు.

స్రవంతికి సాయం చేయాలంటూ ఇటీవల ప్రముఖ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్వీట్​ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్​ కు అనూహ్య స్పందన వచ్చింది. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన సహా పలు సంఘాలు స్రవంతి కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా టీ మిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ స్రవంతికి రూ. 6.77 లక్షలు ఆర్థిక సాయం అందించాడు. ఇటీవలే కరోనా నివారణ నిధికి రూ.11 కోట్ల మేర విరాళాలు సేకరించిన విరాట్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

మాజీ క్రికెటర్​ స్రవంతి నాయుడు తల్లి కరోనా బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆమెకు సాయం చేయాలంటూ బీసీసీఐ మాజీ సౌత్‌జోన్‌ కన్వీనర్‌ విద్యా యాదవ్.. ఓ ట్వీట్ చేసి దానిని విరాట్ కోహ్లీకి ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన విరాట్​ కోహ్లీ రూ.6.77 లక్షల సహాయం అందించాడు. ఇప్పటికే స్రవంతి నాయుడు తన తల్లి కోసం రూ. 16 లక్షలు ఆస్పత్రి బిల్లు కట్టింది. అయినప్పటికీ ఆమె కోలుకోలేదు.


Tags:    

Similar News