సాధారణంగా భర్తలు చిత్రహింసలు పెడితే భార్యలు కోర్టులను ఆశ్రయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది. రాక్షసిగా మారి భార్య చిత్ర హింసలు పెడుతుంటే తట్టుకోలేని భర్త హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వింత ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కోల్ కతాకు చెందిన జ్యోతిర్మయి మజుందార్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. తల్లిదండ్రులు, భార్యతో కలిసి కోల్ కతా నగరంలో నివాసం ఉంటున్నాడు. కరోనా విజృంభిస్తున్న వేళ తల్లిదండ్రులను తనతోపాటు కోల్ కతాకు తీసుకువచ్చాడు. అత్తామామ రాకను భార్య తీవ్రంగా వ్యతిరేకించింది. కరోనా సోకుతుందని ఇంటికి తీసుకురావద్దని భర్తను హెచ్చరించింది. అయితే భర్త వినకుండా ఇంటికి తల్లిదండ్రులను తీసుకొచ్చాడు.
దీంతో భర్తకు ఆ భార్య నరకం చూపించింది. రోజు చెంపదెబ్బలు కొట్టడం..పిన్నులతో గుచ్చడం.. సిగరెట్లతో కాల్చడం చేస్తుండేది. భార్య చిత్రహింసలు భరించలేక చివరకు జ్యోతిర్మయి పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఇది వింత కేసు అని పోలీసులు పట్టించుకోలేదు. చట్టాలు మహిళకు మాత్రమే రక్షణగా ఉంటాయని మిన్నకుండిపోయారు. దీంతో పోలీసులు తనకు న్యాయం చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని జ్యోతిర్మయి పేర్కొన్నారు.