కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ గెలుపు క‌ష్ట‌మే!

Update: 2022-07-11 14:19 GMT
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో చక్రం తిప్పుతున్న రాజ‌కీయ యువ నాయ‌కులు.. బ్ర‌ద‌ర్స్ కోమటిరెడ్డి సోద‌రుల రాజ‌కీయం హీటెక్కి స్తోంది. వారు ఏ పార్టీలో ఉన్నారు..?  ఏం చేస్తున్నారు?  ఎవ‌రికి మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు?  ఏ పార్టీకి స‌పోర్టు చేస్తున్నారు?  అస‌లు వారి వ్య‌వ‌హార శైలి ఏంటి?  వంటి అనేక విష‌యాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ఎందుకంటే.. సుదీర్ఘ కాలం నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డిలు కాంగ్రెస్‌లో ఉన్నారు. ప‌ద‌వులు తెచ్చుకున్నారు. అనుభ‌వించారు., పార్టీ త‌ర‌ఫున టికెట్లు తెచ్చుకుని గెలుపు గుర్రాలు ఎక్కుతున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన పరిస్థితిలో ఉంది. వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా .. విజ‌యం ద‌క్కించుకుని ముందుకు సాగాల‌ని.. ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ‌లో అధికారం ద‌క్కించుకుని విజ‌య‌గ‌ర్వంతో ముందుకు సాగాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీంతో పార్టీ కోసం ప‌నిచేయాలంటూ.. అన్ని స్థాయిల్లోనూ.. నాయ‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని కోరుతోం ది. నాయ‌కుల మ‌ధ్య విభేదాల‌కు స‌ర్దుబాట్లు చేస్తోంది. పార్టీ బ‌లంగా ఉంటేనే విజ‌యం ద‌క్కుతుంద‌ని.. చెబుతోంది. అయితే.. దీనికి విరుద్ధంగా కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌హ‌రిస్తుండ‌డమే ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

కోమ‌టిరెడ్డి సోద‌రులు ఎక్క‌డా నిల‌క‌డ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి రాజ‌గోపాల్‌రెడ్డి  ప్ర‌త్యేక‌ తెలంగాణ రాష్ట్రం కోసం.. త‌న మంత్రి ప‌ద‌విని కూడా వ‌దులుకున్నార‌నే సింప‌తీ ఉంది. కానీ, ఆయ‌న చేస్తున్న రాజ‌కీయా లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. నిజానికి ప్ర‌జ‌లు.. సీనియారిటీ కంటే.. ప‌లుకుబ‌డికి ఎక్కువ‌గా వాల్యూ ఇస్తారు. ఈ విష‌యం తెలుసుకున్నా.. ఆయ‌న మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వెంక‌ట‌రెడ్డి త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే.. ఆయ‌న ప‌రోక్షంగా కొన్నాళ్లుగా బీజేపీకి మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు. ప్ర‌త్య‌క్షంగానే మోడీ స‌ర్కారును, బీజేపీ నాయ‌కుల‌ను ఆయ‌న ప్ర‌శంసిస్తున్నారు. వేదిక ఏదైనా బీజేపీ స్మ‌ర‌ణ‌లో ఆయ‌న మునిగి తేలుతున్నార‌ని కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, వెంక‌ట రెడ్డి కూడా త‌క్క‌వేమీ తిన‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈయ‌న కొత్త‌గా పార్టీ పెట్టిన ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నార‌నే వాద‌న ఉంది. గ‌తంలో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న‌ప్పుడు... ఇలానే కామెంట్లు చేశారు.

ఒక ర‌కంగా చెప్పాలంటే..వెంక‌ట‌రెడ్డి దూకుడుకు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిద్ర‌పోని రాత్రులు కూడా గ‌డిపార‌నే వాద‌న అప్ప‌ట్లో వినిపించింది. అక్ర‌మాలు చేస్తున్నార‌ని.. టీఆర్ ఎస్‌తో చేతులు క‌లిపార‌ని.. ప్ర‌భుత్వానికి అమ్ముడు పోయార‌ని ఇలా.. అనేక విమ‌ర్శ‌లు చేశారు. ఏకంగా.. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేవర‌కు కూడా కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్ నిద్ర‌పోలేదంటే.. అతిశ‌యోక్తి కాదు. ఇక‌, ఇప్పుడు అధ్య‌క్షుడుగా ఉన్న రేవంత్ విష‌యంలోనూ ఇలానే చేస్తున్నారు. ఆయ‌న‌ను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. రాజ‌కీయంగా రేవంత్‌ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇలా.. ఇద్ద‌రి అన్న‌ద‌మ్ముల వ్య‌వ‌హారం చూస్తుంటే.. కాంగ్రెస్ గెల‌వ‌క‌పోయినా.. ప‌ర్వాలేదు కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్య‌మంత్రి కాకూడ‌దు.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ వాదులు కూడా చెబుతున్నారు., మాకు వెంక‌ట‌రెడ్డి మీద మంది అభిప్రాయం ఉ న్నా.. కాంగ్రెస్‌ను న‌ష్ట‌ప‌రిచే మాట‌లు మాట్లాడుతుంటే.. ప్ర‌జ‌ల‌కు ఈ బ్ర‌ద‌ర్స్‌పై అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని.. కాంగ్రెస్ వాదులు సైతం అంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. ఈ బ్ర‌ద‌ర్స్ త‌మ ప‌ద్ధ‌తి మార్చుకుంటారో లేదో చూడాలి.
Tags:    

Similar News