క‌న్‌ఫ్యూజ‌న్‌ లో కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌

Update: 2021-11-05 09:04 GMT
కోమ‌టి రెడ్డి సోద‌రులు.. కాంగ్రెస్‌ లో ఎంతో సీనియ‌ర్ నాయ‌కులు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా లో గొప్ప ప‌ట్టున్న నేత‌లు. దివంగ‌త ముఖ్య‌ మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాం లో ఓ వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు త‌మ ఆలోచ‌న ధోర‌ణి తో ఇబ్బందులు తెచ్చుకుంటున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యం గా కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి త‌నకు ఇష్ట‌ మొచ్చిన‌ట్లు మాట్లాడి పార్టీ లో చుల‌క‌న అవుతున్నార‌నే వ్యాఖ్య‌లు విని పిస్తున్నాయి. ఏ విష‌యంలో నైనా సూటి గా మాట్లాడే వెంక‌ట్‌ రెడ్డి కి ఇప్పుడా మాట తీరే స‌మ‌స్య‌లు సృష్టిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ప్ర‌స్తుతం కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గా.. వెంకట్‌రెడ్డి భువ‌న‌గిరి ఎంపీ గా ఉన్నారు. అక్క‌డి ప్ర‌జ‌ల్లో వీళ్ల‌ కు గొప్ప ఆద‌ర‌ణ ఉంది. వీళ్ల కార‌ణం గా పార్టీ కి మంచి మ‌ద్ద‌తు ఉంది. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వెంక‌ట్‌ రెడ్డి అప్ప‌ట్లో త‌న మంత్రి ప‌ద‌వి కి కూడా రాజీ నామా చేశారు. కానీ ఆ విష‌యం ఎక్కువ మంది కి తెలీద‌ని ఆయ‌న‌కు దాని వ‌ల్ల ఎలాంటి క్రెడిట్ ద‌క్క‌ లేద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. దాంతో పాటు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఆశ‌ ప‌డ్డ ఆయ‌న చివ‌ర భంగ‌ప‌డ్డారు. రేవంత్‌ రెడ్డి ని టీపీసీసీ అధ్య‌క్షుడి గా అధిష్ఠానం ఎంపిక చేయ‌డం తో ఆగ్ర‌హం తో ఊగి పోయిన వెంక‌ట్‌ రెడ్డి.. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మ‌ణిక్యం ఠాగూర్‌ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. డ‌బ్బుల‌ కు అమ్ముడ‌ పోయారంటూ ఆరోపించారు. చిలికి చిలికి గాలి వాన‌లా మారిన ఆ వివాదం ఎలాగో స‌ద్దుమ‌ణిగింది.

ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ లో కాంగ్రెస్ డిపాజిట్ కూడా తెచ్చుకోక‌పోవ‌డం తో మ‌రో సారి వెంక‌ట్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి ని త‌ప్పుప‌డుతూ మాట్లాడారు. అస‌లు ప‌రిస్థితి ని తెలుసు కోకుండా వెంక‌ట్‌రెడ్డి అలా మాట్ల‌డ‌టం కాంగ్రెస్ పార్టీ లోని కొంత‌మంది నాయ‌కుల‌ కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించిన‌ట్లు చెబుతున్నారు. హుజూరాబాద్‌ లో ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ఎస్ అన్న‌ట్లు గానే పోటీ సాగింద‌ని అత్యంత ఖ‌రీదైన ఎన్నిక‌ గా మారిన ఈ పోరు లో త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం ఎలాగో క‌ష్ట‌మేన‌ని వెంక‌ట్‌రెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌ల‌కు తెలుసు. అయిన‌ప్ప‌టికీ రేవంత్ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి న‌ష్ట‌మ‌ని తెలిసినా.. వాళ్లు బహిరంగంగా సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. దీంతో రేవంత్ మీద ఉన్న కోపం తో మొత్తం పార్టీకే న‌ష్టం క‌లిగేలా మాట్లాడ‌టం ఎంత‌ వ‌ర‌కూ స‌మంజ‌స‌మ‌ని వెంక‌ట్‌ రెడ్డి పై యూత్ విభాగం అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఒక‌ప్పుడు పార్టీ లో వెలుగు వెలిగిన కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్.. ఇప్పుడు పార్టీ లో త‌గిన ప్రాధాన్య‌త త‌క్క‌డం లేద‌ నే అసంతృప్తి తో ఉన్న‌ట్లు స్ప‌ష్టం గా తెలుస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు. దీంతో ఏ ప‌రిస్థితుల్లో ఎలా మాట్లాడా లో అనే సంగ‌తి ప‌క్క‌న‌ పెట్టి ఇష్ట‌ మొచ్చిన వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని సొంత పార్టీ వ‌ర్గాలే అంటున్నాయి. మొత్తానికి కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ క‌న్‌ఫ్యూజ‌న్‌ లో ఉన్నార‌ని అందుకే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News