కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు - కోమటిరెడ్డి బ్రదర్స్ గా పేరొందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైల్ గురించి ప్రత్యేంగా చెప్పక్కర్లేదు. నల్లగొండ జిల్లా రాజకీయాలు మొదలుకొని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల వరకు ఈ ఇద్దరు సోదరుల శైలి విభిన్నం. అదే రీతిలో తాజాగా మరో ప్రత్యేకతను వారు సొంతం చేసుకున్నారు. అదే....రూ 5 కోట్ల కారు రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా! ఆ విలాసవంతమైన కారుకు ఫ్యాన్సీ నంబరు కోసం రూ.2 లక్షలు వెచ్చించడం ద్వారా!
సుమారు ఐదుకోట్ల విలువ చేసే ఫెరారి కారు ఖైరతాబాద్ ఆర్ టీఏ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడి పేరున రిజిస్ట్రేషన్ అయింది. ఆర్టీఏ కార్యాలయానికి తీసుకువచ్చిన ఈ కారుకు అక్కడ స్థలం అనువుగా లేకపోవడం కార్యాలయంలోకి లోకి వెళ్ళలేకపోయింది! దీంతో ఎంవీఐ చంద్రశేఖర్ కార్యాలయం నుండి బయటకు వచ్చి రూ.5 కోట్ల విలువైన కారును కోమటిరెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పేరున కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. కాగా, వేలం పాటలో సుమారు. రూ.1.98 లక్షలను వెచ్చించి ప్యాన్సీ నెంబర్ ను దక్కించుకోవడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/