టీ కాంగ్రెస్ నాయ‌కులు రెస్ట్ తీసుకుంటార‌ట‌

Update: 2016-03-10 10:37 GMT
మీకు గుర్తుండే ఉంటుంది. గ‌త ఏడాది కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ చెప్పా పెట్ట‌కుండా అక‌స్మాత్తుగా మాయ‌మ‌యిన సంద‌ర్భం. ఎక్క‌డికి వెళ్లాలని ఆరాతీస్తే విశ్రాంతి కోసం అయ్య‌వారు విదేశాల‌కు వెళ్లార‌ని తేలింది. ఇపుడు సేమ్ ట్రెండ్‌ ను ఆయ‌న పార్టీకి చెందిన తెలంగాణ నాయ‌కులు ఫాలో అవున్నారు. టేక్ ఏ బ్రేక్ అనేది ప్రోగ్రామ్‌ ల్లో చూస్తుంటాం కానీ పాలిటిక్స్ అస‌లు విని ఉండం. అయితే ఈ కొత్త‌ ట్రెండ్‌ ను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాటిస్తార‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీకి వ‌చ్చిన కోమ‌టిరెడ్డి  అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎప్ప‌ట్లాగే టీఆర్ ఎస్‌ పై విమ‌ర్శ‌లు చేసిన కోమ‌టిరెడ్డి 2017 వరకు టీ కాంగ్రెస్ నాయ‌కుల‌మంతా రెస్ట్ లో ఉంటామని ప్ర‌క‌టించారు. 2018లో తిరిగి కార్యక్షేత్రంలోకి దిగుతామని ప్రకటించారు. ఇక త‌మ సొంత జిల్లా గురించి మాట్లాడుతూ ప్ర‌స్తుత మంత్రి జ‌గ‌దీశ్‌ రెడ్డి ఇలాగే కొన‌సాగితే జిల్లాలోని అన్ని స్థానాలు తామే గెలుచుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మంత్రిగా జ‌గ‌దీశ్ రెడ్డి ప‌నితీరును త‌ప్పో  ఒప్పో తేల్చ‌డం వ‌ర‌కు బాగానే ఉందికానీ...పార్టీ రెస్ట్‌ లోకి వెళ్లిపోతుంద‌ని చెప్ప‌డం ఏంట‌ని నాయ‌కులు స‌ణుక్కుంటున్నారు.
Tags:    

Similar News