మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణంపై అయిదేళ్ల తరువాత చర్చ జరుగుతోంది. అవుటర్ రింగు రోడ్డుపై కారు ప్రమాదంలో మరణించిన ప్రతీక్ ది ప్రమాదం కాదు హత్య అని.. అది తామే చేశామని గ్యాంగ్ స్టర్ నయీం వేరే వ్యక్తులతో అన్న మాటలు ఇప్పుడు చర్చకు తెరతీశాయి. అయితే, డబ్బుల కోసం కోమటిరెడ్డిని బెదిరించారా? ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా? అయినా పోలీసులు పట్టించుకోలేదా? అధికార పార్టీకి చెందిన మంత్రి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు లక్ష్య పెట్టలేదు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కోమటిరెడ్డి కుమారుడిని తామే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించామంటూ నయీం భువనగిరికిచెందిన వ్యాపారి గంపా నాగేంద్రని బెదిరించి కోటి వసూలు చేశాడు. పోలీసుల కాల్పుల్లో నయీం మరణించిన తరువాత నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నయీం తనను బెదిరించిన ఆడియో టేపులను కూడా పోలీసులకు అందజేశాడు. దీంతో ఇప్పుడు కోమటిరెడ్డి కుమారుడి రోడ్డు ప్రమాదంపై పలు అనుమానాలు రేగుతున్నాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొందరు అజ్ఞాత వ్యక్తులు బెదిరించారని, ఈ విషయమైన కోమటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని, కానీ వారు పట్టించుకోలేదని సమాచారం. ఆ క్రమంలోనే ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడని పలువురు పేర్కొంటున్నారు.
ప్రతీక్ రెడ్డి 2011 - డిసెంబరు 20న ఔటర్ రింగు రోడ్డుపై కారు ప్రమాదంలో మరణించాడు. అప్పటి పోలీసుల ఎఫ్ ఐఆర్ - పత్రికా వార్తల ప్రకారం.. ప్రతీక్ రెడ్డి కారుకు అకస్మాత్తుగా గొర్రెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి బోల్తాపడి 30 అడుగుల ఎత్తుపై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితో పాటు అతని ముగ్గురు స్నేహితులు - డ్రైవర్ తో సహా మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దీంతో విచారణ అనంతరం ఈ కేసును పోలీసులు 2012 డిసెంబరులో మూసేశారు. కానీ.. నయీం దాన్ని తాను చేసిన హత్యగా చెప్పడంతో అది నిజమేనా? లేదంటే వ్యాపారిని బెదిరించడానికి ఆయన అలా అబద్ధం చెప్పాడా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై మరోసారి విచారణ జరపాలన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు, దీనిపై కోమటిరెడ్డి కుటుంబం నుంచి స్పందన రాకపోవడం కూడా అనుమానాలకు దారితీస్తోంది.