తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి తెలీనోళ్లు.. పరిచయం కానోళ్లు అంటూ ఎవరూ ఉండరు. అలాంటి ఈ ఇద్దరుబ్రదర్స్ నోటి నుంచి తాజాగా వస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వంపై నిత్యం అసంతృప్త వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఈ ఇద్దరు నేతల చుట్టూ మరో ఆసక్తికర న్యూస్ తిరుగుతోంది.
ప్రజాబలం భారీగా ఉన్న ఈ ఇద్దరు నేతలు త్వరలో బీజేపీలోకి వెళ్లనున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోడీషాలకు అత్యంత సన్నిహితుడు రాంమాధవ్ ను హైదరాబాద్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కలిసినట్లుగా వార్తలు వచ్చాయ. అయితే.. వీటిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగాఖండించటమే కాదు.. అసలు రాంమాధవ్ అన్నవాళ్లు ఎవరో కూడా తనకు తెలీదంటూ జోకేశారు.
రాంమాధవ్ లాంటి నేత తెలీదన్న మాట కోమటిరెడ్డి నోటి నుంచి వచ్చిందంటే.. సమ్ థింగ్ తేడా ఉందన్న వాదన వినిపిస్తోంది. తెర వెనుక తాము చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ బయట పడతాయన్న ఆలోచనలో హడావుడిగా చేసిన వ్యాఖ్యతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుక్ అయినట్లుగా చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. టీఆర్ ఎస్ కు అసలుసిసలు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉందన్న ఆయన.. ఇక మా ఆశలన్ని బీజేపీ మీదనే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అన్న కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడితే.. తమ్ముడు మాత్రం బీజేపీకి మేలు చేసేలా వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నేతలు రానున్న రోజుల్లో భిన్నధ్రువాలుగా మారుతున్నారా? లేదంటే.. వ్యూహాత్మకంగానే పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారా? ఏమైనా అన్న ఒకలా.. తమ్ముడు మరోలా ఉంటున్న తీరు మాత్రం రాజకీయంగా కొత్త సంచలనానికి తెర తీసేలా ఉందని చెప్పక తప్పదు.