తెలంగాణ కాంగ్రెస్ నేత కమ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం వచ్చేసింది. తామెంతగా ప్రయత్నించినా సీఎం కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విషయంలో ఫెయిల్ కావటం.. వరుసగా వస్తున్న ఎన్నికల్లో గులాబీ బ్యాచ్ ను దెబ్బేయలేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిత్యం అంతర్గత కుమ్ములాటలు.. పదవుల పంపకంలో నడిచే పంచాయితీలో పార్టీలోని వారిపై పైచేయి సాధించేందుకు సమయమంతా ఖర్చు చేస్తున్న వేళ.. కేసీఆర్ లాంటి మాస్టర్ మైండ్ ను రాజకీయంగా దెబ్బ తీయటం అంత సులువైన విషయం కాదు.
ఇదే విషయం తాజాగా వెల్లడైన పుర ఎన్నికల ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయని చెప్పాలి. అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ.. మిగిలిన రెండు.. మూడు స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగరాలన్న పట్టుదలతో ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ బ్యాచ్ తీరు కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయం సంపూర్ణంగానే కాదు.. ప్రత్యర్థులు ఎవరూ మిగిలిపోకూడదన్నట్లుగా ఉండే టీఆర్ఎస్ అధినేత వ్యూహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బరస్ట్ అవుతున్నారు.
ఏముందిలే కేసీఆర్ అని తాము అనుకోవటంలో చేసిన తప్పు ఎంత ఖరీదైనదన్న విషయం ఇప్పుడిప్పుడే వారికి అర్థమవుతోంది. అందుకేనేమో.. ఎప్పుడూ లేనంత తీవ్రంగా గులాబీ బాస్ మీద విరుచుకుపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు నిజాయితీగా జరగలేదన్న ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి.. సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన పాతికేళ్ల అనుభవంలో ఇంత ఘోరమైన ఎన్నికల్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. పెద్ద అంబర్ పేట.. చౌటుప్పల్ లో తమ కౌన్సిలర్లను ఎత్తుకెళ్లిపోయారని.. చౌటుప్పల్ లో సీపీఎం వాళ్లను కొనేసారన్నారు. రజాకార్ల కంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారన్న కోమటిరెడ్డి.. సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబెల్స్ పోటీ చేస్తే వారందరిని సస్పెండ్ చేస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా వారిని పార్టీలో చేర్చుకోవటం ఏమిటని ప్రశ్నించారు.
కేసీఆర్.. కేటీఆర్ సిగ్గు లేకుండా పని చేస్తున్నారని.. వారిని వదిలిపెట్టమన్నారు. గ్రామ గ్రామాన తిరిగి ఎండగడతామన్న ఆయన.. నల్గొండలో టీఆర్ఎస్ - బీజేపీ.. ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకు వెళ్లే రోజు వస్తుందని.. వారు చేసిన అవినీతి ఆధారాలు ఈడీ.. విజిలెన్స్ కు అందిస్తానని చెప్పారు. మిమ్మల్ని కోమటిరెడ్డి వదిలిపెట్టడంటూ భారీ వ్యాఖ్యనే చేశారు. తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన సారును ఉద్దేశించి కోమటిరెడ్డి మరీ అంతలా వార్నింగ్ లు ఇవ్వటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొందరపడి ఒక మాట అన్నందుకు కోమటిరెడ్డికి తిప్పలు తప్పవన్న టీఆర్ఎస్ నేతల మాటల్ని చూస్తే.. ఇలాంటి విషయాల్ని గుర్తు పెట్టుకొనే సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి వార్నింగ్ ఇస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు.