సీనియర్ జర్నలిస్టు, సాక్షి టెలివిజన్ ఛానెల్‌కు చెందిన ప్రముఖ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని చేపట్టనున్నారు.
ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరో రెండు వారాల్లో పదవీకాలం పూర్తికానున్న దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
కొమ్మినేని కమ్మ సామాజికవర్గానికి చెందినప్పటికీ గత 15 ఏళ్లుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు.
సాక్షి ఛానెల్‌లో చేరి ఉదయం డిబేట్‌లు నిర్వహించడం ప్రారంభించినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అభిమానిగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.
కాగా కొమ్మినేని గతంలో ఈనాడు దినపత్రికలో చాలా కాలం పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతికి మారారు. అప్పట్లో కొమ్మినేని చంద్రబాబుకు మద్దతుదారుడిగా ఉండేవారు. అంతేకాకుండా చంద్రబాబుకు ఆంతరంగిక జర్నలిస్టుల్లోనూ కొమ్మినేనికి చోటు ఉండేది.
ఆ తర్వాత ఎక్కడ చెడిందో తెలియదు కానీ జగన్‌కు మద్దతుగా కొమ్మినేని స్టాండ్ తీసుకున్నారు. ఎన్‌టీవీలో జగన్‌కు అనుకూలంగా ఉదయం పూట డిబేట్లు నిర్వహించేవారు. ఇదే కారణంలో ఆ చానెల్ యాజమాన్యం ఆయనను అప్పట్లో తొలగించిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాక్షి టీవీ కొమ్మినేనికి పెద్దపీట వేసింది.
2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొమ్మినేనికి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తారని చాలా మంది ఊహించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.
అయినప్పటికీ, కొమ్మినేని జగన్‌కు విధేయుడిగానే మెలిగారు. ఈ విధేయతే కలిసి వచ్చి ఇప్పుడు కేబినెట్ ర్యాంకు హోదాతో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ బాధ్యతలను చేపట్టనున్నారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.