పలు విజయవంతమైన సినిమాలకు రచయితగా వ్యవహరించి, తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్ అయిన రచయిత కోన వెంకట్.. జనసేన అధితి పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కుటుంబ రీత్యా కోన వెంకట్ ది కాంగ్రెస్ పార్టీ సానుభూతి తత్వం. వీరి తాత కోన ప్రభాకర్ రావు కీలకమైన పదవుల్లో ఉండిన వ్యక్తి. ఇక కోన వెంకట్ బాబాయ్ కోన రఘుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆయన పోటీలో ఉన్నారు.ఈ నేపథ్యంలో వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కోన వెంకట్ చంద్రబాబు, పవన్ లపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
-పవన్ కల్యాణ్ తన ప్రసంగాలతో విద్వేషాలను రగిలిస్తూ ఉన్నారని కోన వెంకట్ అన్నారు. తెలంగాణలో విద్వేషాలను రగిల్చి పబ్బం గడుపుకోవాలని పవన్ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని అన్నారు.
-పవన్ కల్యాణ్ తనకు సన్నిహితుడే అని, అయితే ఆయన జగన్ మీద అంతగా ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావడం లేదని కోన వెంకట్ వ్యాఖ్యానించారు.
-చంద్రబాబు నాయుడును బ్రహ్మణద్రోహిగా అభివర్ణించారు కోన. బాబుకు ఏపీలోని ఒక్క బ్రహ్మణుడు కూడా ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు రాజకీయం అత్యంత నీఛం అని, అలాంటి విలన్ ను సినిమాల్లో కూడా తను క్రియేట్ చేయలేమనే భావనను వ్యక్తం చేశారు కోన.
-పవన్ కల్యాణ్ కూడా జగన్ లాగా పాదయాత్ర చేయాల్సిందని, అప్పుడు ఆయనకు అన్ని విషయాలూ అర్థం అయ్యేవని, ప్రజల కష్టాలు తెలిసేవని అన్నారు.
-జగన్ మీద పవన్ చేస్తున్న ఆరోపణల్లో దేన్ని నిరూపించినా తను కూడా జనసేన జెండా పట్టుకోవడం ఖాయమని ఈ స్టార్ రైటర్ అన్నారు. సినీ పరిశ్రమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు చాలా మంది ఉన్నారన్నారు.
-చంద్రబాబు అవినీతి అక్రమాలపై పవన్ కల్యాణ్ విమర్శలు ఎందుకు తగ్గుముఖం పట్టాయని కోన ప్రశ్నించారు.
-జగన్ ప్రకటించిన నవరత్నాలు కార్యక్రమంతో ప్రజల జీవితాలు బాగుపడతాయని కోన వెంకట్ అన్నారు. నవ్యాంధ్రకు జగన్ ఆశాజ్యోతి అని వ్యాఖ్యానించారు.