సంచలనంగా ‘కొండా’ ఆడియో క్లిప్పింగ్

Update: 2016-10-14 07:13 GMT
మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు. నాయకులు ఎక్కువైతేపార్టీలో అధిపత్య పోరు పెరుగుతుంది. ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాలు ఇదే తీరులో ఉన్నాయి. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలకు చెందిన నేతలతో టీఆర్ ఎస్ పార్టీ హౌస్ ఫుల్ అయ్యింది. ముఖ్యనేతలంతా ఒకేపార్టీలోకి వచ్చినప్పుడు పదవుల దగ్గర నుంచి అధిపత్యం వరకూ రచ్చ రచ్చగాఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణ అధికారపక్షంలో చోటుచేసుకుంది.

వరంగల్ టీఆర్ ఎస్ లో ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుకు.. నగర మేయర్ నన్నపునేని నరేందర్ కు మధ్య నడుస్తున్న వర్గ పోరు అంతాఇంతా కాదు.ఎవరికి వారు వారి అధిపత్యం నిలుపుకునే ప్రయత్నంతో కిందిస్థాయి నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీరి మధ్య నడుస్తున్న అధిపత్య పోరుతో..కార్పొరేటర్లకు పెద్ద కష్టంగా మారింది. ప్రతి విషయంలోనూ పెద్దల జోక్యం రోజురోజుకీ పెరిగిపోవటం.. చివరకు డివిజన్ పరిధిలో జరిగే సమావేశాలకు సైతం పెద్దల అనుమతి తప్పనిసరిగా మారటం వారికి కొత్త ఇబ్బందిని తెచ్చిపెడుతోంది.

ఒకవేళ ఒక డివిజన్ కు చెందిన నేత.. మరో డివిజన్ లోకాలు పెడితే చాలు..రాత్రి అయ్యేసరికి పంచాయితీ మొదలవుతుందని.. రాత్రివేళ వచ్చే ఫోన్ కాల్ తో దిమ్మ తిరిగిపోయేలా ఉండటమే కాదు.. ఆ మాటల్ని.. బూతుల్నితట్టుకోవటం చాలా కష్టమని చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా తాజాగా ఒక ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. కొండా మురళీ వాయిస్ తో ఉన్న ఈ ఆడియో క్లిప్పింగ్ ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. తనకు తెలీకుండా సమావేశం ఏర్పాటు చేశారంటూ ఒక మైనార్టీ వర్గానికి చెందిన కార్పొరేటర్ భర్తను అసభ్య పదజాలంతో తిట్టిన తిట్లకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ఒకటి బయటకురావటమే కాదు.. ఈ విషయంపై కొన్నిమీడియా సంస్థలు వార్తలు కూడా అచ్చేసే వరకూ విషయం వెళ్లిపోయింది.

సదరు ఆడియోలో ఉన్న సంభాషణను ఎడిట్ చేసి మరీ అచ్చేశారు కూడా. అయితే.. ఈ ఆడియో పెద్ద కుట్ర అని.. వాయిస్ ని మార్ఫింగ్ చేసి.. విదేశాల్లో తయారు చేసి తమ నేత పరపతిని దెబ్బ తీసేందుకే విడుదల చేశారంటూ కొండావర్గం ఆరోపిస్తోంది. కొండా దంపతుల్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు కడియంశ్రీహరి.. ఎర్రబెల్లి దయాకర్ రావులు అమెరికాలో కుట్రపన్ని.. ఈ తరహా ప్రచారానికి దిగుతున్నట్లుగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో హడావుడిచేస్తున్న ఈ ఆడియో క్లిప్పింగ్ లో కొన్ని మాటల్ని ఎడిట్ చేసిన మరీ ఒకమీడియా సంస్థ ప్రచురించింది. ఆ సమాచారాన్ని యథాతధంగా చూస్తే..

కొండా: సచ్చిపోతవు.. ఏమనుకుంటున్నావ్‌.. మీటింగ్‌ లు పెట్టి ఎవరినిపిలుస్తున్నవ్‌.. ఏం.. రా.. ...కొడుకా.. సిగ్గులేదా..  కరీమాబాద్‌ లో మీటింగ్‌ పెట్టిఎవరిని పిలిచినవురా..  ఏంరా.. ...కొడుకా.. రికార్డు చేసుకుంటున్నవారా.. నీరికార్డులు.. కొడుకా.. ఏమైనా చేసుకో.  నీ..వాడితో తన్నిస్తా.. సంపుతా..ఏమనుకుంటున్నవో నా.. కొడుకా.. నేను నీకు కార్పొరేటరు టికెటిచ్చినా..నీకెవ్వరు ఇస్తరురా? కృతజ్ఞత లేని.. కొడుకా!



బాధితుడు: లేదన్నా.. నేను నీ మనిషిని.. నీ దగ్గర ఉన్నోళ్ళే నిన్ను మోసంచేస్తున్నరు.. తప్పుడు మాటలు చెబుతున్నారు నా మీద. నేను అట్లాంటోన్నికాదన్నా.. ఎందుకు ఇట్ల మాట్లాడుతున్నవు ఈ విధంగా బాధితుడు ప్రాధేయపడుతున్నప్పటికీ బూతు పురాణం కొనసాగింది.
Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News