మాజీ మంత్రి,ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. కొండా సురేఖ.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లతో కలిసి తెలగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ ఇప్పుడు నక్సలైట్ల అణచివేత కు పాల్పడుతు న్నారని ఆమె వ్యాఖ్యానించారు.
తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టీఆర్ ఎస్ నేతల ఆగడాలు సాగేవి కావన్నారు. అంతేకాదు.. కేసీఆర్ కుటుంబం తాటతీసేవారని.. అన్నారు. నక్సలైట్ల హయంలోనే తెలంగాణ బాగుండేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలోను, తెలంగాణ రాష్ట్రంలోను అధికారంలోకి వస్తుందని సురేఖ జోస్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే తమపై అక్రమ కేసులు బనాయించారని సురేఖ చెప్పారు.
కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను టీఆర్ ఎస్ ప్రభుత్వం లాక్కుందని తెలిపారు. కాంగ్రెస్‌లో రాహుల్ ,రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడకు వచ్చిన సురేఖ.. సంచలన దర్శకుడు రాం గోపాల్ తీసిన.. కొండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం.. తాము పోరాటాలు చేసినా.. కేసీఆర్ విలువ ఇవ్వ లేదని విమర్శలు గుప్పించారు. తమ కుటుంబానికి గౌరవం దక్కక పోవడంతోనే తాము పార్టీ నుంచి బయ టకు వచ్చామన్నారు.
ఎవరితోనూ తమకు సమస్యలు లేవని.. రాజకీయంగా తమను అణదొక్కాలని ప్రయత్నించిన వారే.. ఇబ్బందులు పడుతున్నారని.. పరోక్షంగా టీఆర్ ఎస్ స్థానిక నేతలపై విమర్శలు గుప్పించారు. టీఆర్ ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్న సురేఖ.. కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అవకాశాలు మెరుగుపడుతున్నాయని వ్యాఖ్యానించారు.