తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీలు కల్లోలం రేపాయి. నిన్న ఏఐసీసీ రిలీజ్ చేసిన లిస్ట్ లో తన జూనియర్ల కంటే తనకు తక్కువ స్థానం కల్పించారని కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేయడం సంచలనమైంది.
ఇది తనను అవమానించడమే అని.. పదవులు ముఖ్యం కాదు .. ఆత్మాభిమానం ముఖ్యం అని కొండా సురేఖ తెలిపారు. తాను కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రదేశ్ రాజకీయ వ్యవహారాల కమిటీలో నాకంటే జూనియర్లకు అవకాశం కల్పించారు. నన్ను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జి క్యూటివ్ కమిటీ మెంబర్ గా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నానని కొండా సురేఖ అన్నారు.నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యం.
మా కుటుంబం 34 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మమ్మల్ని అభిమానించే వారు ఉన్నారు.
రాజకీయ వ్యవహారాల కమిటీలో రాజకీయ బతుకుదెవరువు కోసం మూటముల్లె సర్దుకొని ఇతర పార్టీ నుంచి వచ్చిన వారితో నిండిపోయింది. కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని వాళ్లను నామినేట్ చేసిన కమిటీలో నన్ను నామినేట్ చేయడం అవమానపరిచినట్టుగా భావిస్తున్నా.. నేను, నా భర్త, వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ..పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్య కార్యకర్తలుగా కొనసాగుతాం అని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు.
ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కొత్త కమిటీలో వరంగల్ నేతల పేర్లు లేకపోవడం బాధ కలిగిందని కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డితో కొండా సురేఖ సమావేశమయ్యారు. మరోవైపు ఈ కొత్త కమిటీలో కోమటిరెడ్డి పేరు లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాశమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.