కొండా వర్సెస్ కార్తీక్ రెడ్డి.. పైచేయి ఎవరిదో?

Update: 2019-02-13 06:43 GMT
చేవెళ్ల కాంగ్రెస్‌ లో టిక్కెట్ పోరాటం తీవ్రంగా ఉంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిముందు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆరెస్‌ ను వీడి కాంగ్రస్‌ లో చేరారు. అప్పుడు రాహుల్ గాంధీ ఆయనకు 2019లో ఎంపీ టిక్కెట్ ఇవ్వడానికి హామీఇచ్చారని చెబుతున్నారు. కానీ.. చేవెళ్లలో రాజకీయ పరిస్థితులు మాత్రం కొండాకు ఏమాత్రం అనుకూలంగా లేవని చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ అశించిన దక్కని కార్తీక్ రెడ్డి(సబితా ఇంద్రారెడ్డి తనయుడు) ఇప్పడు చేవెళ్ల లోక్ సభ టిక్కెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారట.
   
నిజానికి కార్తీక్ రెడ్డి 2014లో చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈపారి ఆయనకే టిక్కెట్ వస్తుందని అంతా అనకున్నారు. పార్టీలో పెద్దగా పోటీ కూడాలేదు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందన్న అంచనాలు భారీగా ఏర్పడడంతో ఆయన రాజేంద్ర నగర్ టిక్కెట్ కోరారు. కానీ, పార్టీ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు. ఇంతలో చేవెళ్ల సిటింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ లోకి రావడంతో కార్తీక్ రెడ్డి సీటుపై అనిశ్చితి ఏర్పడింది. పైగా రాహుల్ నుంచి హామీ ఉందని కొండా వర్గం ప్రచారం చేసుకుంటోంది.
   
కానీ, కార్తీక్ రెడ్డి మాత్రం వరుసగా తనకు జరుగుతున్న నష్టాన్నికాంగ్రెస్ పెద్దలకు చెప్పి చేవెళ్ల సీటుపై మళ్ల హామీ పొందారని సమాచారం. ఇదే కనుక నిజమైతే కొండాకు షాక్ .అటు టీఆరెస్ పార్టీ నుంచి వచ్చేయడం.. ఇక్కడ టిక్కెట్ రాకపోవడం కానీ జరిగితే రాజకీయంగా ఆయన దెబ్బయిపోయినట్లే. అదే సమయంలో కార్తీక్ రెడ్డికి కూడా ఈసారి గెలుపు చాలా కీలకం కావడంతో ఈ పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సిందే.
   

Tags:    

Similar News