ప్రకాష్ రాజ్ పనులు కావవి.. మావి అంటున్న సర్పంచ్.. కేటీఆర్ కే షాకిచ్చింది
పంచాయితీ అభివృద్ధి విషయంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. ఆ గ్రామ సర్పంచ్ కు మధ్య విభేదాలు బయటపడ్డాయి. షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామ అభివృద్ధికి ప్రకాష్ ఎంతో చొరవ తీసుకున్నారని ఇటీవల మంత్రికేటీఆర్ ట్వీట్టర్ లో పోస్ట్ చేసి కొనియాడారు.
అయితే పోస్ట్ చూసిన కొండారెడ్డి పల్లె సర్పంచ్ ఏకంగా మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. పైసలు మావైతే ప్రశంసలు ప్రకాష్ రాజ్ కా అంటూ ప్రశ్నించారు.
కొండారెడ్డిపల్లి గ్రామం రూపురేఖలు మారాయని ఆ గ్రామానికి చెందిన మధుసూదన్ రావు అనే వ్యక్తి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ గ్రామంలోని రోడ్లు, ఫుట్ పాత్ లు, ఆహ్లాదరక చెట్లు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆ గ్రామాన్ని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నారని.. ప్రకాష్ రాజ్ తోపాటు ఇక ఈ గ్రామ ప్రగతికి కారణమైన స్థానిక ఎమ్మెల్యే అంజయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.
అయితే తాము అభివృద్ధి చేసుకుంటే ప్రకాష్ రాజ్ కు కితాబు ఇవ్వడంపై కొండారెడ్డిపల్లి సర్పంచ్ అసహనం వ్యక్తం చేశారు.గ్రామాన్ని తమ సొంత నిధులతో అభివృద్ధి చేసుకున్నామని గ్రామ సర్పంచ్ పల్లె స్వాతి తెలిపారు. కేటీఆర్ పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
గ్రామాన్ని దత్తత తీసుకున్నానన్న ప్రకాష్ రాజ్ కంటే ఎక్కువ నిధులు తాము ఖర్చు పెట్టామని సర్పంచ్ వెల్లడించారు. గ్రామాన్ని అభివృద్ధి చేసిన తమను అభినందించాల్సింది పోయి ప్రకాస్ రాజ్ పై ప్రశంసలు ఏంటని ప్రశంసించారు.
2015లో ప్రకాష్ రాజ్ ఈ కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నారు. అక్కడ వైద్యశిబిరం ఏర్పాటు చేసి అప్పటి నుంచి గ్రామ అభివృద్ధికి పనిచేస్తూ వచ్చారు. మరుగుదొడ్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం 12 వేలు ఇస్తే.. ప్రకాష్ రూ.4వేలు ఇచ్చారు. ఇక అభివృద్ధి పనులకు లక్షలు వెచ్చించారు. కానీ తాజాగా సర్పంచ్ మాత్రం అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. మరి నిజం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.