ఆ పార్లమెంటులో పెప్పర్ స్ర్పే మంటలు

Update: 2015-12-15 04:15 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. ముచ్చటగా మూడుసార్లు. అదీ నెల వ్యవధిలో. దేశ అత్యున్నత పార్లమెంటులో విపక్ష సభ్యుల పెప్పర్ స్ప్రే వ్యవహారం కొసావా దేశాన్ని కుదిపేస్తుంది. దక్షిణ ఐరాపా దేశమైన కొసావాలో విపక్ష సభ్యులు తీరుతో అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజా సమస్య గురించి తెలుసుకోవాలంటే.. తొలుత కాస్తంత చరిత్ర తెలుసుకోవాలి. అందుకు గతంలోకి ప్రయాణం చేయాలి.

సెర్బియా నుంచి 2008లో కొసావా స్వాతంత్ర్యం పొందించింది. అప్పటి నుంచి తన బతుకు తాను బతికే ఆ దేశం.. తాజాగా యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వంతో పలు అంశాలపై సెర్బియాతో ఒప్పందాలు చేసుకోవాలన్న అధికారపక్ష నిర్ణయం తాజా వివాదానికి కారణం. ఏ దేశం నుంచి అయితే అతి కష్టమ్మీద స్వాతంత్ర్యం పొందామో.. ఇప్పుడు అదే దేశంలో మళ్లీ ఒప్పందం ఏమిటని విపక్ష సభ్యులు మండిపడుతున్నారు. అధికారపక్షాన్ని నిలువరించేందుకు ఎంతవరకైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో గత నెల రోజుల క్రమంలో కొసావా పార్లమెంటులో విపక్ష సభ్యులు పెప్పర్ స్ప్రే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా.. పెప్పర్ స్ప్రే జల్లిన విపక్ష సభ్యుల కారణంగా.. సభలోని ఎంపీలు పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమావేశాల్ని విజయవంతంగా అడ్డుకున్న విపక్ష సభ్యులు అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించటం గమనార్హం. సెర్బియాతో కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకోవాలని విపక్షాలు బలవంతం చేస్తున్నాయి. దీనికి అధికారపక్షం ససేమిరా అంటోంది. దీంతో.. ఇంత రచ్చ జరుగుతోంది.
Tags:    

Similar News